Shriya Saran : నటి శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. ఎన్నో హిట్ చిత్రాల్లో దాదాపుగా అగ్ర హీరోలు అందరి పక్కనా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు అప్పట్లోనే తన గ్లామర్ షోతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య కాలంలో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి రొమాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది.
శ్రియా శరన్ ఇటీవలే గత కొద్ది నెలల కిందట తనకు కుమార్తె పుట్టిందన్న విషయాన్ని సోషల్ మీడియావేదికగా వెల్లడించింది. అయితే ఈమెకు పెళ్లి అయినట్లు తెలుసు కానీ.. గర్భం ధరించినట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈమెకు ఒక్కసారిగా బిడ్డ పుట్టింది అని చెప్పేసరికి అందరూ షాకయ్యారు. కానీ ఈమె కరోనా సమయంలో అసలు బయటకు రాలేదు. ఆ సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలియజేసి అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఇక శ్రియ తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు థ్యాంక్స్ చెప్పింది. ఉపాసన తమ అపోలో హాస్పిటల్స్‌ను చూసుకుంటుంటారు. అయితే శ్రియ భర్తకు ఆ హాస్పిటల్‌లో హెర్నియా ఆపరేషన్ అయింది. ఇటీవలే సర్జరీ జరిగింది. దీంతో తన భర్త కోలుకుంటున్నాడని.. అతనికి అందించిన మెరుగైన చికిత్సకు, సదుపాయాలకు థ్యాంక్స్.. అని చెబుతూ ఉపాసనకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ క్రమంలోనే తన భర్తతో హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను శ్రియ షేర్ చేసింది.
ఇక శ్రియ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్‌లో కీలకపాత్రలో నటించింది. ఈ మధ్యే ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలెలో డ్యాన్స్‌లు వేసి అలరించింది. అలాగే బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ పక్కన దృశ్యం 2 రీమేక్‌లో నటిస్తోంది.