Hibiscus Leaves For Long Hair : జుట్టు ఒత్తుగా, అందంగా, పొడవుగా పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు పెరుగుదలకు చేసే ప్రయత్నాల్లో మందార ఆకులను ఉపయోగించడం కూడా ఒకటి. ఎంతో కాలంగా జుట్టు పెరుగుదలకు మనందార ఆకులను, పువ్వులను ఉపయోగిస్తూ ఉన్నాము. మందార ఆకులను, పువ్వులను పేస్ట్ గా చేసి జుట్టు పట్టిస్తూ ఉంటారు. అలాగే నూనెలో మందార ఆకులు వేసి ఆ నూనెను జుట్టు రాస్తూ ఉంటారు. ఇలా వివిధ రకాల హెయిర్ ప్యాక్ లల్లో కూడా మందార ఆకులను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మనలో చాలా మందికి మందార ఆకులు నిజంగానే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయన్నా అన్న సందేహం కలుగుతుంది.
మందార ఆకులు మన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయా.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు… అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందార ఆకులు మన జుట్టుకు 4 రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. మందార ఆకుల్లో ఉండే ఐసోప్లేవనాయిడ్స్ జుట్టు కుదుళ్లకు రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేస్తాయి. రక్తం ఎక్కువగా సరఫరా అవ్వడం వల్ల పోషకాలు, ఆక్సిజన్ జుట్టు కుదుళ్లకు ఎక్కువగా అందుతాయి. అలాగే జుట్టు కుదుళ్లల్లో ఉండే వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా తయారవుతాయి.
అలాగే జుట్టు కణాల కవచాలను గట్టి పరచడంలో మందార మనకు దోహదపడుతుంది. కణ కవచాలు గట్టిగా ఉండడం వల్ల జుట్టు కణాలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటాయి. అదే విధంగా జుట్టును నల్లగా ఉంచడంలో కూడా మందార మనకు సహాయపడుతుంది. జుట్టు కుదళ్లల్లో మెలనోసైటిస్ ఉంటాయి. ఇవి మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి.మెలనిన్ ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే జుట్టు అంత నల్లగా ఉంటుంది. మందార ఆకులను వాడడం వల్ల మెలనిన్ ఎక్కువగా తయారవుతుంది. దీంతో జుట్టు నల్లగా ఉంటుంది. ఇక జుట్టు కుదుళ్లు, తల చర్మం పొడిబారకుండా చేయడంలో కూడా మందార మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులో ఉండే ఫైటో కెమికల్స్ జుట్టు కుదుళ్లు పొడిబారకుండా కాపాడడంలో దోహదపడతాయి.
మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లు పొడిబారకుండా, జుట్టు విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నాలుగు రకాలుగా మందార ఆకులు మన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి దాని నుండి రసాన్ని తీసి జుట్టుకు పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. అలాగే నూనెలో ఎండిన మందార ఆకులు వేసి మరిగించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి తలకు రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మందార ఆకులను వాడడం వల్ల జుట్టు పొడవుగా, నల్లగా ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.