మిరియాలతో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?

మిరియాలను సుగంధ ద్రవ్యాలకు రారాజుగా పిలుస్తారు. అంటే కింగ్ ఆఫ్‌ ది స్పైసెస్‌ అన్నమాట. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో పలు ఔషధాలను తయారు చేస్తారు. వంటి ఇంటి దినుసులుగా వాడుకునే మిరియాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటంటే…

home remedies using black pepper

1. మిరియాలను లేదా వాటి పొడిని వేయడం వల్ల ఆహార పదార్థాలకు చక్కని రుచి వస్తుంది. మిరియాలను రోజూ వాడుతుంటే అజీర్తి తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది.

2. మిరియాలను రోజూ తీసుకుంటే పుండ్లు, గాయాలు త్వరగా తగ్గుతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. మిరియాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. చిటికెడు మిరియాల పొడిని ఒక టీస్పూన్‌ తేనెతో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం తీసుకోవాలి. అధిక బరువు తగ్గుతారు.

4. మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. జ్వరం, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, లివర్‌ వ్యాధులు తగ్గుతాయి.

5. అజీర్తి, మలబద్దకం, డయేరియా, గ్యాస్‌ వంటి సమస్యలను మిరియాలు తగ్గిస్తాయి. మిరియాల్లో ఉండే పైపరీన్‌ ఆహారంలోని బి విటమిన్లు, బీటా కెరోటిన్‌లను రక్తంలో కలిసేలా చేస్తుంది. దీంతో మెదడులో ఎండార్ఫిన్స్‌ విడుదలవుతాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. డిప్రెషన్‌ నుంచి బయట పడవచ్చు. చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయి.

6. పక్షవాతం వచ్చినవాళ్లకి ఆ భాగంలో నువ్వుల నూనెలో మిరియాల పొడి కలిపి వేడి చేసి రాస్తే ఫలితం కనిపిస్తుంది.

7. చిటికెడు మిరియాల పొడి, పావు టీ స్పూన్‌ ఉప్పు కలిపి దంతాలను తోముకోవాలి. నోటి దుర్వాసన, చిగుళ్లు, దంతాల నొప్పి తగ్గుతాయి. దంతాలు తెల్లగా మెరుస్తాయి.

8. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని మిరియాలు వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని ఒక గ్లాస్‌ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే శరీరంలోని శ్లేష్మం తగ్గుతుంది. జలుబు, ముక్కు దిబ్బడ ఉండవు.

9. ఒక టీస్పూన్‌ మిరియాలను తీసుకుని పొడి చేసి ఒక కప్పు నీళ్లలో మరిగించాలి. అందులో ఒక వెల్లుల్లి రెబ్బను నలిపి కలపాలి. ఈ డికాషన్‌ను వడబోసి కొద్దిగా తేనె కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. మూత్ర సమస్యలు తగ్గుతాయి. మలేరియా జ్వరం ఉన్నవారికి కూడా ఈ మిశ్రమం పనిచేస్తుంది. ఇక ఇందులోనే చిటికెడు ఉప్పు కలిపి పుక్కిలిస్తే టాన్సిల్స్‌ కారణంగా వచ్చే గొంతు నొప్పి తగ్గుతుంది.

10. మిరియాల్లో అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఫైబర్‌, ఐరన్‌, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ సి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే పోషణ లభిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts