భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి చింత పండును ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక రకాల కూరల్లో వేస్తుంటారు. అయితే సీజన్‌లో చింత చిగురు కూడా ఎక్కువగా లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. చింత చిగురు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పైల్స్ సమస్య తగ్గుతుంది.
2. చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
3. చలి జ్వరం వచ్చిన వారు చింత చిగురును తింటే జ్వరం నుంచి బయట పడవచ్చు. చింత చిగురులో ఉండే ఔషధ గుణాలు ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతాయి.
4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. చింత చిగురులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.
5. నోట్లో పుళ్లు, పొక్కులు ఏర్పడ్డవారు చింత చిగురును తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
6. చింత చిగురును తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
7. కడుపులో నులి పురుగుల సమస్యలతో బాధపడే పిల్లలకు చింత చిగురును తినిపించాలి. దీంతో సమస్య తగ్గుతుంది.
8. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
9. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
10. తరచూ చింత చిగురును తింటుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. థైరాయిడ్, డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు చింత చిగురును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
11. చింత చిగురును తింటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నేత్ర సమస్యలు తగ్గుతాయి. కళ్లు దురదలుగా ఉంటే కాస్త చింత చిగురును తినాలి. ఉపశమనం కలుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365