Categories: Featured

అరోమాథెరపీ ఆయిల్స్‌.. ఏయే నూనెలతో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..?

సాధారణంగా పువ్వులను వాసన చూస్తే మనస్సుకు ఎంతో హాయి కలిగినట్లు అనిపిస్తుంది. పువ్వుల నుంచి వచ్చే సువాసనలను చాలా మంది ఇష్టపడతారు. ఆ వాసనల వల్ల మెదడులోని నాడులు ప్రేరేపించబడతాయి. దీంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. అందుకనే అరోమా థెరపీ అనే పదం వాడుకలోకి వచ్చింది. అరోమా థెరపీ అంటే పలు రకాల సువాసనలను పీల్చి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడం అన్నమాట. ఈ క్రమంలోనే పలు రకాల ఆయిల్స్‌ను అరోమాథెరపీ కోసం వాడుతుంటారు.

reduce stress and anxiety with these aroma therapy oils reduce stress and anxiety with these aroma therapy oils

అరోమా థెరపీ వ్యాధులను తగ్గించదు. కానీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మానిసక ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే వస్తాయి. అయితే మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఆయా వ్యాధులు రాకుండా ఉంటాయి. కనుక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలి. అందుకు గాను అరోమాథెరపీ పనిచేస్తుంది.

అరోమాథెరపీ వల్ల మనస్సుకు ఆనందాన్ని కలిగించే ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనం అవుతాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల అరోమా థెరపీతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.

అరోమా థెరపీలో భాగంగా గులాబీ, మల్లెపూలు, లిలియాక్‌, లావెండర్‌, సిట్రస్‌ పండ్లు, పుదీనా ఆకులు, చందనం, తులసి ఆకులు, వాము, దాల్చిన చెక్క, లవంగం, జాజికాయ.. వంటి పదార్థాలు, ఆకులతో తయారు చేసిన నూనెలను వాడుతారు. వాటిని వాసన పీలిస్తే పలు సమస్యలు తగ్గుతాయి.

1. మల్లె పువ్వుల ఆయిల్‌ను వాసన పీల్చడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

2. లావెండర్‌ ఆయిల్‌ను వాసన పీలిస్తే ఒత్తిడి, జలుబు, మైగ్రేన్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. దీన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే శరీరం తాజాగా అనిపిస్తుంది. దిండు మీద రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ను వేసి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ ఆయిల్‌ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి చెమట వాసన రాకుండా ఉంటుంది.

3. అరోమాథెరపీలో గులాబీ తైలాన్ని అద్భుతమైన తైలంగా చెబుతారు. సున్నిత మనస్సు ఉన్నవారికి ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది. డిప్రెషన్‌, ఒత్తిడి, చర్మ సమస్యలు తగ్గుతాయి.

4. సంపెంగ నూనెను వాసన చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది. జుట్టుకు పెరుగుదలకు సహాయ పడుతుంది. హైబీపీ, తలనొప్పి తగ్గుతాయి.

5. మరీ ఓవర్‌ యాక్టివ్‌గా ఉండే పిల్లలకు మరువం తైలాన్ని నీటిలో కలిపి స్నానం చేయించాలి. దీంతో వారు స్థిమితంగా ఉంటారు. ఈ నూనె ఒత్తిడిని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని పోగొడుతుంది. మరువం నూనెతో మర్దనా చేస్తే తలనొప్పి, టెన్షన్లు తగ్గుతాయి. నీటిలో వేసి ఆవిరిపడితే ఆస్తమా, సైనస్‌ వంటి సమస్యలు తగ్గుతాయి.

6. రోజ్‌మేరీ ఆయిల్‌ను వాసన పీల్చడం వల్ల మనస్సు ఉత్తేజంగా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. డిప్రెషన్‌, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

7. నిమ్మ ఆయిల్‌ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.

8. చందనం ఆయిల్‌ను వాసన పీలిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే అలసట తగ్గుతుంది.

9. యూకలిప్టస్‌ ఆయిల్‌లో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. శరీరంలోని శ్లేష్మాన్ని ఈ ఆయిల్‌ తగ్గిస్తుంది. అలాగే మైగ్రేన్‌, జ్వరం, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఈ ఆయిల్‌ను వాసన పీలిస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts