ఎండ ముదిరింది, గాలిలో తేమ తగ్గింది. ఎక్కడ, ఎవరికి చూసినా దగ్గు, జలుబు, తుమ్ములు, కాస్తో కూస్తో జ్వరం లాంటి అనారోగ్యం వస్తున్నాయి. చిన్నపాటి ఈ అనారోగ్యాలు పోవాలంటే…అందరికి అందుబాటోలో వున్న దాల్చిన చెక్క, లవంగాల టీ ఎలా తయారో చేయాలో చూడండి. శ్వాస సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క, లవంగాల టీ బాగా పనిచేస్తుంది.
సహజంగా లభించే ఔషద మూలికలు దాల్చిన చెక్క, లవంగాలతో దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పని. ప్రతిరోజూ ఒక కప్పు దాల్చిన చెక్క, లవంగాల టీ తాగి రోజంతా హాయిననుభవించండి. ఇందులో వుండే పదార్ధాలు ఏమిటి ? ఒక్క ముక్క దాల్చిన చెక్క, రెండు లేదా 3 లవంగాలు, ఒక గ్లాసుపాలు, అతికొద్దిగా షుగర్, కొన్ని టీ ఆకులు. తయారీ విధానంలో…దాల్చిన చెక్క, లవంగాలు ఒకే ఒక్క నిమిషం పెనంపై వేడి చేయండి.
వేయించిన వీటిని గ్రైండర్ లో మెత్తటి పౌడర్ గా చేయండి. ఒక్క గ్లాసెడు పాలలో ఒక చెంచా టీ పొడి, టీ ఆకులు, పంచదార వేసి మరిగించండి. ఇక మెత్తటి దాల్చిన చెక్క లవంగం పొడి అందులో వేసి అన్నీ బాగా కలపండి. దగ్గు, కఫం, గొంతు మంట లేదా నొప్పి వున్నవారు రోజుకు మూడు కప్పులు తాగితే, అవి మటుమాయం. ఈ రోజులలో ఇంటికి వచ్చిన అతిధులకు సైతం ఒక కప్పు అందిస్తే వారికి ఆరోగ్యమే కాక, ఏంతో విభిన్నంగా వుంటుంది.