చిట్కాలు

మీ ముఖంపై ఉన్న న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పోవాలా..? అయితే ఇలా చేయండి..!

నల్లమచ్చలు ఒక రకమైన చర్మ సమస్య. వాటిని సీరియస్ గా తీసుకోకపోతే అందాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల నల్లమచ్చలని సీరియస్ గా తీసుకుని వాటిని పోగొట్టుకోవడానికి చర్యలు చేపట్టాల్సిందే. సహజంగా నల్లమచ్చలు అవే తగ్గుతూ అవే పెరుగుతుంటాయి. ఒక్కోసారి తగ్గడం అనేది ఉండకుండా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని ముఖంపై నుండి పోగొట్టుకోవడానికి కొన్ని ఇంటిచిట్కాలని తెలుసుకుందాం. బేకింగ్ సోడాని కొన్ని నీళ్ళలో కలుపుకుని పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి పెట్టుకోవాలి. అలా కొన్ని రోజుల పాటు పాటిస్తే ముఖంపై నల్ల మచ్చలు పోయే అవకాశం ఉంటుంది. చనిపోయిన చర్మకణాలని పూర్తిగా తొలగించి కొత్త చర్మ కణాలు ఏర్పడడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది.

మీరు గ్రీన్ తాగకపోతే దాన్ని నల్లమచ్చలు పోగొట్టుకోవడానికి ఉపయోగించండి. గ్రీన్ టీ ఆకులని తీసుకుని దానికి కొద్దిగా నీటిని కలుపుకుని బాగా దంచితే పేస్ట్ లాగా తయారవుతుంది. అది ముఖంపై నల్లమచ్చలున్న చోట పెడితే చాలు మీ ముఖం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. పసుపు వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. కస్తూరి పసుపుని నీటితో కలుపుకుని లేదా కొబ్బరి నూనెతో కలుపుకుని పేస్ట్ తయారు చేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

if you have dark spots on face follow these remedies

గుడ్డులోని తెల్లని భాగాన్ని ముఖంపై రాసుకుని మాస్క్ లాగా చేసుకుంటే చాలా బెటర్. గుడ్డులో ఉండే పోషకాలు నల్లని మచ్చలని మాయం చేస్తాయి. నల్లమచ్చలున్న వారు వీటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Admin