Itching : మనలో చాలా మందిని వేధించే చర్మ సమస్యల్లో దురద కూడా ఒకటి. అయితే సాధారణంగా శరీరం పైన కనబడే భాగాల్లో దురద వస్తే వేళ్లతో రుద్దడం వళ్ల ఆ దరుద పోతుంది. కానీ గజ్జలు, పిరుదుల మధ్య దురద వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య వేధిస్తే ఆ బాధ ఇంతా కాదు. ఫంగల్ ఇన్పెక్షన్ ల కారణంగా ఆ భాగంలో దురద వస్తుంది. ఆ భాగంలో దురద రావడం వల్ల వేళ్లతో గోకుతూ ఉంటారు. దీంతో ఆ భాగంలో చర్మం కూడా నల్లగా మారుతుంది. చర్మం మందంగా తయారవుతుంది. లావుగా ఉన్న వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరూ చూసిన బిగుతూ దుస్తులను ధరిస్తున్నారు. దీంతో శరీరానికి గాలి తగలడం లేదు.
ఇలా గాలి ఆడక గజ్జల్లో చెమట పట్టడం వల్ల గాలిలో ఉండే క్రిములు ఆ భాగంలో చేరి ఇన్పెక్షన్ ను కలిగిస్తాయి. ఈ ఫంగల్ ఇన్పెక్షన్ కారణంగా దురద వస్తుంది. ఇటువంటి సమస్యతో బాధపడే వారు వేపాకులను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేపాకును తెచ్చి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో పసుపును కలిపి చంకలు, పిరుదుల మధ్యలో, గజ్జలు వంటి భాగాల్లో రాసుకోవాలి. తరువాత వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు ధరించి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. అయితే అందరికి వేపాకులు అందుబాటులో ఉండవు. అలాంటి వారు వేపనూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా వేప నూనెను రాసుకుని ఒక గంట పాటు అలాగే ఉండాలి. తరువాత స్నానం చేసి ఆ భాగాల్లో తడి లేకుండా శుభ్రంగా తడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయా భాగాల్లో దురద తగ్గుతుంది.
అలాగే రాత్రి పడుకునే సమయంలో గజ్జలు, పిరుదులు వంటి భాగాల్లో స్వచ్ఛమైన తేనెను రాసుకోవాలి. తేనె రాసుకోవడం వల్ల ఆయా భాగాల్లో చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను తేనె కలిగి ఉంటుంది. దీంతో సమస్య సులభంగా తగ్గుతుంది. అలాగే బయటకు వెళ్లే సమయంలో గజ్జలు, చంకలు, పిరుదుల మధ్యలో నూనె రాసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల ఆయా భాగాల్లో చెమట పట్టకుండా చెమట జారిపోతుంది. దీంతో క్రిములు చేరకుండా ఉంటాయి. చర్మం పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ఈచిట్కాలను పాటించడం వల్ల గజ్జల్లో దురద తగ్గడంతో పాటు చర్మం కూడా తిరిగి సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.