Instant Halwa : నోట్లో వేసుకోగానే వెన్న‌లా క‌రిగిపోయే హ‌ల్వా.. త‌యారీ ఇలా..!

Instant Halwa : మ‌నం కందిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను, సాంబార్, ప‌ప్పు చారు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. కందిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ చేసే ఈ వంట‌కాల‌తో పాటు కందిప‌ప్పుతో మ‌నం హ‌ల్వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కందిపప్పుతో చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగాఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇన్ స్టాంట్ గా చాలా తేలిక‌గా ఈ హల్వాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – 2 క‌ప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, గోధుమ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, కుంకుమ పువ్వు నీళ్లు – 2 టేబుల స్పూన్స్, పంచ‌దార – ఒక క‌ప్పు.

Instant Halwa recipe very easy to make and tasty
Instant Halwa

ఇన్ స్టాంట్ హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా కందిప‌ప్పును కుక్క‌ర్ లో వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత నీళ్లు పోసి మెత్త‌గా మూత పెట్టి మెత్త‌గా ఉడికించుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే క‌ళాయిలో మ‌రో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత గోధుమ‌పిండి వేసి వేయించాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉడికించిన కందిప‌ప్పు వేసి క‌ల‌పాలి. ఇందులోనే కుంకుమ పువ్వు నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌ల‌పాలి. దీనిని 10 నుండి 15 నిమిషాల పాటు వేయించాలి.

ఇలా వేయించిన త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌రో టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌ల‌పాలి. దీనిని 10 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించిన త‌రువాత హ‌ల్వాలో నెయ్యి పైకి తేలుతుంది. హ‌ల్వా అంటుకోకుండా త‌యార‌వుతుంది. ఇలా త‌యార‌వ్వ‌గానే యాల‌కుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ హ‌ల్వా త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిగా హ‌ల్వాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts