Kobbari Ravva Laddu : కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల‌ను ఇలా చేసి చూడండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Kobbari Ravva Laddu : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో ర‌వ్వ ల‌డ్డూలు కూడా ఒక‌టి. ర‌వ్వ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ ర‌వ్వ ల‌డ్డూల‌ను కొబ్బ‌రి వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలాసుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు -పావు క‌ప్పు, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, ఉప్మా ర‌వ్వ – ఒక క‌ప్పు, యాల‌కులు – 10, పంచ‌దార – ముప్పావు క‌ప్పు నుండి ఒక క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – త‌గిన‌న్ని.

Kobbari Ravva Laddu recipe in telugu easy to make
Kobbari Ravva Laddu

కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ఎండుకొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ర‌వ్వ వేసి వేయించాలి. ర‌వ్వ కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ర‌వ్వ‌ను గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత జార్ లో వేయించిన ఎండుకొబ్బ‌రి ముక్క‌లు, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ఈ కొబ్బ‌రి మిశ్ర‌మాన్ని వేయించిన ర‌వ్వ‌లో వేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. వీట‌న్నింటిని చ‌క్క‌గా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత పాల‌ను కొద్ది కొద్దిగా పోసుకుంటూ క‌లుపుకోవాలి. త‌రువాత ర‌వ్వ మిశ్ర‌మాన్ని తీసుకుని ల‌డ్డూలుగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పండ‌గ‌ల‌కు ఇలా రుచిగా, సుల‌భంగా కొబ్బ‌రి ర‌వ్వ ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts