Perugu Vankaya Kura : పెరుగు వంకాయ కూర‌ను ఇలా చేయాలి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Perugu Vankaya Kura : వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉంటాయి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె వంకాయలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది వంకాయ‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో పెరుగు వంకాయ కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు వంకాయ కూర‌ను రుచిగా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు వంకాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గుత్తి వంకాయ‌లు – పావు కిలో, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయలు – 2, ప‌చ్చిమిర్చి – 5, పెరుగు – 200 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – 3 టేబుల్ స్పూన్స్, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – అర టీ స్పూన్, తాళింపు దినుసులు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ప‌సుపు – పావు టీ స్పూన్.

Perugu Vankaya Kura recipe in telugu very tasty cook in this way
Perugu Vankaya Kura

పెరుగు వంకాయ కూర త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను నాలుగు ప‌చ్చాలుగా క‌ట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వంకాయల‌ను వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు స‌గం వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ప‌చ్చిమిర్చి వేగిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ప‌చ్చి కొబ్బ‌రి తురుము వేసి రంగు మారే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన ఉల్లిపాయ ముక్క‌ల‌తో పాటు ప‌ల్లీలు, ప‌చ్చిమిర్చి కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే పెరుగు కూడా వేసి మెత్త‌గా పేస్ట్ లాగా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ తో పాటు వేయించిన వంకాయ‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర‌, ధ‌నియాల పొడి వేసి క‌లపాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు వంకాయ కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ పెరుగు వంకాయ కూర‌ను కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts