Knee Pain : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. పెద్దవారే కాకుండా నడి వయస్కులు, యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. మోకాళ్ల నొప్పుల సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. క్యాల్షియం లోపం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, తగినంత వ్యాయామం చేయకపోవటం, వయసు పైబడడం వంటి వివిధ కారణాల చేత మోకాళ్ల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్యల బారి నుండి బయటపడడానికి పెయిన్ కిల్లర్ ను వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల నొప్పి తగ్గినప్పటికి భవిష్యత్తులో అనేక రకాల దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం చాలా సులభంగా ఈ సమ్యల నుండి బయటపడవచ్చు.
మోకాళ్ల నొప్పులను తగ్గించే ఇంటి చిట్కాలు ఏమిటి.. వీటిని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు.. తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో నువ్వులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడంతో పాటు వీటితో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం మోకాళ్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నువ్వులను జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి కలపాలి. తరువాత దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు వేయించాలి.
అడుగు మాడకుండా కలుపుతూ ఇలా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను మోకాళ్ల నొప్పులపై రాసుకుని నూనె చర్మంలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేయాలి. ఈ విధంగా రాత్రి పడుకునే ముందు మోకాళ్లకు రాసుకుని ఉదయాన్నే వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ల నొప్పులను తగ్గించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు కర్పూరాన్ని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 4 లేదా 5 కర్పూరం బిళ్లను మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఇందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను రోజుకు రెండు పూటలా మోకాళ్లపై రాసుకోవడం వల్ల నొప్పినుండి ఉపశమనం కలుగుతుందని నిపుణలు చెబుతున్నారు. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా చాలా సులభంగా మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటితో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. చక్కటి జీవన విధానాన్ని అవలంబించాలి.