Kuppintaku For Nerve Pain : కోట్లు విలువ చేసే ఆకు ఇది.. త‌ల నుంచి కాళ్ల వ‌ర‌కు చ‌చ్చుబ‌డిపోయిన న‌రాల‌ను ప‌నిచేయిస్తుంది..!

Kuppintaku For Nerve Pain : మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల విరివిరిగా పెరిగే ఔష‌ధ మొక్క‌ల‌ల్లో కుప్పింటాకు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఇది ఔష‌ధ మొక్క అని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. పిచ్చి మొక్క‌గా భావించి దీనిని పీకేస్తూ ఉంటారు. కానీ కుప్పింటాకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. దీనిని సంస్కృతంలో విశ్వ‌రూపిణి అని అంటారు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మందులు వాడే అవ‌స‌రం లేకుండా అలాగే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా మ‌నం చాలా సుల‌భంగా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

గ‌జ్జి, తామ‌ర‌, దుర‌ద‌లు, దద్దుర్లు వంటి చ‌ర్మ వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో కుప్పింటాకు చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. దీని కోసం కుప్పింటాకుకు సున్నాన్ని క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్రమాన్ని చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న చోట లేప‌నంగా రాయాలి. ఇలా 4 నుండి 5 రోజుల పాటు రాయ‌డం వ‌ల్ల చ‌ర్మ‌వ్యాధులు పూర్తిగా న‌యం అవుతాయి. చెవుడును నివారించ‌డంలో కూడా కుప్పింటాకు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. కుప్పింటాకు మొక్క ఆకుల‌ను, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, మిరియాల‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నువ్వుల నూనెలో వేసి వేడి చేయాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజూ 2 నుండి 3 చుక్క‌ల మోతాదులో వారం రోజుల పాటు చెవిలో వేసుకోవ‌డం వ‌ల్ల చెవుడు స‌మ‌స్య తగ్గుతుంది. అదే విధంగా ఇలా త‌యారు చేసుకున్న నూనెను రాత్రి పడుకునే ముందుగ ముక్కులో వేసి ప‌డుకోవాలి.

Kuppintaku For Nerve Pain how to use this for better results
Kuppintaku For Nerve Pain

ఇలా చేయ‌డం వ‌ల్ల గుర‌క స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది. అదే విధంగా ఈ తైలాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం కీళ్ల నొప్పులను త‌గ్గించుకోవ‌చ్చు. ఇలాత‌యారు చేసుకున్న తైలాన్ని నొప్పులు ఉన్న చోట రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నొప్పులు క్ర‌మంగా త‌గ్గుతాయి. అలాగే ప‌క్ష‌వాతాన్ని త‌గ్గించ‌డంలో కూడా కుప్పింటాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. కుప్పింటాకు వేర్ల బెర‌డు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను మాత్ర‌లుగా చేసుకుని రోజుకు రెండు పూట‌లా మింగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా ప‌క్ష‌వాతం స‌మ‌స్య దూర‌మవుతుంది. ఈ విధంగా కుప్పింటాకు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D