Meshashringi For Lungs : ఈ ఒక్క ఆకును తింటే చాలు.. ఊపిరితిత్తులు దెబ్బ‌కు శుభ్ర‌మ‌వుతాయి..

Meshashringi For Lungs : మ‌నల్ని వేధించే శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఆస్థ‌మా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఆస్థ‌మా కార‌ణంగా ద‌గ్గు, ఆయాసం, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం వంటి స‌మ్య‌లు తలెత్తుతాయి. ఆస్థ‌మా బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ధూమ‌పానం, ఇంట్లో పెంచుకునే వివిధ జంతువుల కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌న్యుప‌రంగా కూడా కొంద‌రిలో ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆయుర్వేదం ద్వారా కూడా మ‌నం ఆస్థ‌మా స‌మ‌స్యను త‌గ్గించుకోవ‌చ్చు. మేక మేయ‌ని ఆకును ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా ఆస్థ‌మా స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ మొక్క మ‌న‌కు ఎక్కువ‌గా అడ‌వుల్లో దొరుకుతుంది.

ఈ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల వాంతులు అవుతాయి. క‌నుక వీటిని మేక‌లు తిన‌వు. దీంతో ఈ మొక్క‌కు మేక మేయ‌ని ఆకు అనే పేరు వ‌చ్చింది. ఈ మొక్క‌ను సంస్కృతంలో అజా ద్వేషి అని పిలుస్తారు. అజా అంటే మేక ద్వేష అంటే ద్వేషిస్తుంది. మేక దీనిని ద్వేషిస్తుంది. క‌నుక దీనికి అజా ద్వేషి అనే పేరు వ‌చ్చింది. అలాగే లాటిన్ ఆస్థ‌మేటికా అనే పేరుతో పిలుస్తారు. ఆస్థ‌మాకు సంబంధించిన మందుల్లో ఈ మొక్క‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఆస్థ‌మా వ్యాధి గ్ర‌స్తుల్లో ద‌గ్గు, తెమ‌డ ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది. ఈ మేక మేయ‌ని మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు వాంతులు అవుతాయి. వాంతి రూపంలో పొట్ట‌లో ఉండే ఆహారంతో పాటు ఊపిరితిత్తుల్లో ఉండే కఫం క‌రిగి నీళ్ల రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ ఆకును మొద‌టి రోజు అర ఆకు, రెండో రోజూ ఒక ఆకు, మూడో రోజు ఒక‌టిన్న‌ర ఆకు మోతాదులో తీసుకోవాలి.

Meshashringi For Lungs take these leaves to clean them
Meshashringi For Lungs

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో, శ్వాస కోస నాళాల్లో పేరుకుపోయిన క‌ఫం, తెమ‌డ అంతా ప‌లుచబ‌డి బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీంతో ద‌గ్గు, ఆయాసం త‌గ్గ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డం కూడా తేలిక ప‌డుతుంది. ఈ మేక మేయ‌ని ఆకు పొడి, ర‌సం మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో కూడా ల‌భిస్తుంది. ఈ విధంగా మేక మేయ‌ని మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఆస్థ‌మా స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts