Itching : మనలో చాలా మంది చర్మ ఇన్ ఫెక్షన్ లతో, దురదలతో, అలర్జీలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలర్జీల కారణంగా ఒళ్లంతా దురదగా, మంటగా ఉంటుంది. దురద రావడానికి అలర్జీ, ఇతర చర్మ సమస్యలు, తామర, ఫంగస్, ఫుడ్ అలర్జీ, కీటకాల వంటివి చర్మంపై దురద రావడానికి కారణాలవుతాయి. ఈ సమస్య రాగానే చాలా మంది గోళ్లతో గోకేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా గోకడం వల్ల చర్మం పై గాయాలు అవ్వడమే కాకుండా చర్మం కూడా అందవిహీనంగా మారుతుంది. అంతేకాదు గోకడం వల్ల ఇన్ ఫెక్షన్స్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది.
కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు గోకడం మానేసి కొన్ని చిట్కాలను పాటిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దురదలను, ఇన్ ఫెక్షన్ లను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై దురదలను, ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలో కలబంద ఎంతగానో సహాయపడుతుంది. కలబందను దురదలను తగ్గించే చక్కటి నివారణా మార్గంగా చెప్పవచ్చు. ఇది చర్మంపై చల్లటి ప్రభావాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో విటమిన్ ఇ ఉండడం వల్ల కాలిన గాయాలతో పాటు దురదల చికిత్సలో అద్భుతుంగా పని చేస్తుంది. కలబంద రసాన్ని దురద, ఇన్ఫెక్షన్ ఉన్న చోట చర్మం పై రాయాలి.
అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలో ఆపిల్ సైడ్ వెరిగర్ కూడా చక్కగా పని చేస్తుంది. వెనిగర్ లో ఉండే మూలకాలు ఇన్ఫెక్షన్ లను నివారిం,ఇ అందుకు కారణమైన ఫంగస్ ను తరిమికొడతాయి. సమాన పరిమాణంలో నీటిని మరియు ఆపిల్ సైడ్ వెనిగర్ ను కలిపి ఇన్ఫెక్షన్ లు ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వల్ల దురదల నుండి తక్షణ ఫలితాన్ని పొందవచ్చు. అలాగే కొబ్బరి నూనెలో కూడా యాంటీ ఫంగస్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్, దురద, దద్దుర్లకు కారణమైన ఫంగస్ ను నివారిస్తాయి. చర్మం పై కొబ్బరి నూనెను రోజుకు రెండు నుండి మూడు సార్లు రాయడం వల్ల చర్మసమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెను సమానంగా దాల్చిన చెక్క నూనెను కలిపి రాసినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల ఎన్నో రుగ్మతలను నయం చేయడంలో పసుపు దివ్యౌషధంగా పని చేస్తుంది. దురద, ఇన్ఫెక్షన్ లను నయం చేయడంలో కూడా పసుపు అద్భుతంగా పని చేస్తుంది. చర్మానికి సంబంధించిన ఇతర సమస్యలు అనగా గజ్జి, తామర వంటి వాటిని తగ్గించడంలో పసుపు మనకు సహాయపడుతుంది. పసుపులో నీటిని కలిపి పేస్ట్ గా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.
ఇలా చేయడం వల్ల దురదల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా క్రాన్ బెర్రీస్ లో కూడా యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. చర్మం వచ్చే దురద, ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయి. అంతేకాకుండా ఫంగస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను ఇవి అరికడతాయి. క్రాన్ బెర్రీస్ నుండి తయారు చేసిన జ్యూస్ ను తరచూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.