Allam Pachadi : అల్లం పచ్చడి తయారీ ఇలా.. నోట్లో వేసుకుంటే మైమరిచిపోతారు..

Allam Pachadi : మనం రోజూ వాడే వంట ఇంటి పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. అల్లాన్ని మనం రోజూ పలు రకాల వంటల్లో వేస్తుంటాం. అల్లం ఘాటుగా ఉంటుంది. దీన్ని కూరల్లో వేస్తే చక్కని రుచి, వాసన వస్తాయి. అల్లం రసాన్ని సేవిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే అల్లాన్ని నేరుగా పచ్చడి రూపంలోనూ చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..

పచ్చి మిర్చి – 200 గ్రాములు, అల్లం – 75 గ్రాములు, చింత పండు – 50 నుంచి 75 గ్రాములు, ఉప్పు – కొద్దిగా, బెల్లం – చిన్న ముక్క, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు.

తాళింపు కోసం..

నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, ఎండు మిర్చి – రెండు, వెల్లుల్లి – రెండు రెబ్బలు, కరివేపాకు – గుప్పెడు.

Allam Pachadi know how to make this recipe
Allam Pachadi

అల్లం పచ్చడిని తయారు చేసే విధానం..

ముందుగా బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వేడి చేసి పచ్చి మిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వేసి పచ్చి వాసన పోయే వరకు ఉంచి రెండింటినీ చల్లార్చాలి. ఇప్పుడు వాటితోపాటు చింత పండు పులుసు, బెల్లం, ఉప్పు కూడా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బాలి. అవసరాన్ని బట్టి పలుచగా అవడానికి వేడి నీళ్లు వాడుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి, కరివేపాకులతో తాళింపు వేసి ఈ మిశ్రమంలో కలిపితే చాలు. కారంగా, పుల్లగా, తీయగా, ఘాటుగా ఉండే అల్లం పచ్చడి సిద్ధమవుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో పెడితే వారం వరకు తాజాగా ఉంటుంది. దోశలు, గారెలు, ఇడ్లీల్లో అద్దుకుని తింటే అద్భుతమైన రుచి వస్తుంది. ఈ పచ్చడిని గట్టిగా చేస్తే అన్నంలోనూ కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts