Onion And Mustard Oil For Hair : ఉల్లిపాయ‌తో ఇలా చేస్తే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది.. ఎంతో అద్భుతంగా ప‌నిచేసే చిట్కా..!

Onion And Mustard Oil For Hair : జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి మ‌నం అనేక ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటాం.  వీటి వ‌ల్ల ఫ‌లితం ఎంత ఉంటుందో తెలియ‌దు కానీ మ‌నం మాత్రం ఎంతో ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. జుట్టును రాల‌డాన్ని త‌గ్గించి జుట్టును ధృడంగా మార్చే ఈ నూనెను మ‌న ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం పింక్ రంగులో ఉండే ఉల్లిపాయల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ‌ను తీసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత దానిని జార్ లో వేసి మెత్త‌గా పేస్ట్ లా గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 50 గ్రాముల‌ ఆవ నూనెను తీసుకోవాలి. ఆవ నూనెనుకు బ‌దులుగా  కొబ్బ‌రి నూనెను కూడా మ‌నం ఉప‌యోగించ‌వ‌చ్చు. ఆవ నూనె స‌రిప‌డ‌ని వారు కొబ్బ‌రి నూనెను ఉప‌యోగించాలి. ఈ నూనెను చిన్న మంట‌పై గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి  క‌లుపుతూ వేడి చేయాలి. దీనిని క‌నీసం 15 నుండి 20 నిమిషాల వ‌ర‌కు ఇలా క‌లుపుతూ వేడి చేయాలి. ఉల్లిపాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ధృడంగా పెరుగుతుంది. జుట్టుకు కావ‌ల్సిన అనేక ర‌కాల పోష‌కాలు ఉల్లిపాయ‌లో అధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే స‌ల్ఫ‌ర్ జుట్టు పెరుగుద‌ల‌కు  దోహ‌ద‌ప‌డుతుంది.

Onion And Mustard Oil For Hair works effectively know how to use it
Onion And Mustard Oil For Hair

ఉల్లిపాయ‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. ఇవి చుండ్రు స‌మ‌స్య‌ను నివారించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇలా వేడి చేసిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిపై మూత‌ను ఉంచి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. త‌రువాత ఒక జ‌ల్లిగంటె  లేదా కాట‌న్ వ‌స్త్రం స‌హాయంతో నూనెను వ‌డ‌క‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి. బ‌య‌ట ఎక్కువ ధ‌ర‌ల‌కు నూనెల‌ను కొనుగోలు చేసి వాడ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే ఉల్లిపాయతో నూనెను త‌యారు చేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. కొంద‌రికి  ఉల్లిపాయ వాస‌న న‌చ్చ‌దు. అలాంటి వారు ఇందులో 2 లేదా 3 చుక్క‌ల ఎసెన్షియ‌ల్  ఆయిల్ ను క‌లిపి వాడ‌వ‌చ్చు. దీంతో నూనె ఉల్లిపాయ వాస‌న రాకుండా ఉంటుంది. ఈ నూనెను వారానికి స‌రిప‌డా ఒకేసారి త‌యారు చేసుకుని నిల్వ చేసుకోవ‌చ్చు. ఈ ఉల్లిపాయ నూనెను ఎలా వాడాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌గినంత ప‌రిమాణంలో ఒక గిన్నెలో తీసుకోవాలి.

త‌రువాత  ఈ గిన్నెను నూనె గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి నీటిలో ఉంచాలి. నూనె వేడ‌య్యాక దీనిని వేళ్ల‌తో తీసుకుని జుట్టు కుదుళ్లకు బాగా ప‌ట్టించాలి. త‌రువాత నూనె ఇంకేలా సున్నితంగా మ‌ర్దనా చేసుకోవాలి. ఈ నూనెను రాత్రంతా జుట్టుకు అలాగే ఉంచి ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టుకు సంబంధించిన అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు ఆరోగ్యం, ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. ఈ చిట్కాను పాటిస్తూనే చ‌క్క‌టి పోష‌కాహారాన్ని కూడా తీసుకోవాలి. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

D

Recent Posts