Hotel Style Coconut Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి కొబ్బ‌రి చ‌ట్నీ.. ఇలా చేస్తే హోట‌ల్ స్టైల్‌లో వ‌స్తుంది.. టేస్ట్ అదిరిపోతుంది..

Hotel Style Coconut Chutney : మ‌నం ఉద‌యం పూట దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం,ఉప్మా వంటి ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే ఈ అల్పాహారాల‌ను త‌యారు చేయ‌డానికి ర‌కర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ లేనిదే ఈ అల్పాహారాల‌ను మ‌నం తిన‌లేము. మ‌నం త‌యారు చేసే ర‌క‌ర‌కాల చ‌ట్నీల్లో కొబ్బ‌రి చ‌ట్నీ ఒక‌టి. మ‌న‌కు హోట‌ల్స్ లో కూడా ఈచ‌ట్నీ ల‌భిస్తుంది. ఈ కొబ్బ‌రి చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చ‌క్క‌గా, రుచిగా హోట‌ల్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ కొబ్బ‌రి చ‌ట్నీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, అల్లం – ఒక ఇంచు ముక్క‌, పుట్నాల ప‌ప్పు – ఒక క‌ప్పు, పోపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – 1 టేబుల్ స్పూన్.

Hotel Style Coconut Chutney recipe in telugu perfect for idlis
Hotel Style Coconut Chutney

హోట‌ట్ స్టైల్ కొబ్బ‌రి చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ప‌చ్చిమిర్చి, అల్లం ముక్క‌లు వేసుకుని వేయించుకోవాలి. ప‌చ్చిమిర్చి చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఒక జార్ లో ప‌చ్చికొబ్బరి ముక్క‌లు, పుట్నాల ప‌ప్పు, వేయించిన ప‌చ్చిమిర్చి వేసి ,ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో అర గ్లాస్ లేదా త‌గిన‌న్ని నీళ్లు పోసి మ‌రోసారి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న తాళింపును చ‌ట్నీలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రిచ‌ట్నీ త‌యారవుతుంది. దీనిని ఉద‌యం చేసే అన్నిర‌కాల అల్పాహారాల‌తో క‌లిపి తిన‌వ‌చ్చు.

D

Recent Posts