Papaya Seeds : బొప్పాయి విత్త‌నాల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. వాటిని ఎలా ఉప‌యోగించాలంటే..?

Papaya Seeds : మ‌న‌కు ప్ర‌కృతిలో స‌హ‌జ సిద్దంగా ల‌భించే పండ్ల‌ల్లో బొప్పాయి పండు ఒక‌టి. బొప్పాయి పండును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బొప్పాయి పండులో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బొప్పాయి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటామ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే కేవ‌లం బొప్పాయి పండే కాదు బొప్పాయి పండు గింజ‌లు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బొప్పాయి పండును కోసి లోప‌ల ఉండే విత్త‌నాల‌ను మ‌నం పాడేస్తూ ఉంటాం. కానీ బొప్పాయి పండులో ఉండే విత్త‌నాల‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ తో స‌హా ఎన్నో ముఖ్య‌మైన పోషకాలు ఉంటాయి. ఈ విత్త‌నాలు చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల భ‌యంక‌ర‌మైన అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండు గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి అలాగే ఈ గింజ‌ల‌ను ఏవిధంగా తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పండు గింజ‌ల‌ను నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చు. ఇలా తిన‌లేని వారు వీటిని ఎండ‌లో ఎండ‌బెట్టి పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని జ‌ల్లించి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులు పాడ‌వ‌కుండా తాజాగా ఉంటుంది. ఈ బొప్పాయి గింజ‌ల పొడిని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి తీసుకోవాలి. ఈ బొప్పాయి గింజల్లో క్యాన్స‌ర్ నిరోధ‌కాలు ఉన్నాయ‌ని ఎన్నో ర‌కాల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ బొప్పాయి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు బొప్పాయి పండు గింజ‌ల‌ను మెత్త‌గా రుబ్బుకుని దానిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Papaya Seeds are very beneficial to us how to use them
Papaya Seeds

అలాగే ఈ పొడిని వేడి వేడి అన్నంలో క‌లిపి తీసుకున్నా కూడా కాలేయం చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. బొప్పాయి గింజ‌ల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గిపోతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి. బొప్పాయి గింజ‌ల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ వేగ‌వంతం అవుతుంది. మూత్రపిండాల స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి. బొప్పాయి గింజ‌ల‌ను ఉడికించి చ‌ల్లారిన త‌రువాత తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. మూత్ర‌విస‌ర్జ‌న ప్ర‌క్రియ సాఫీగా సాగుతుంది. బొప్పాయి గింజ‌ల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో నులిపురుగులు న‌శిస్తాయి. అలాగే పొట్ట‌, న‌డుము, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

బొప్పాయి గింజల్లో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌యావాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. బొప్పాయి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే జుట్టు పెరుగుద‌ల‌కు కూడా బొప్పాయి గింజ‌లు మ‌న‌కుఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బొప్పాయి గింజ‌ల పొడిని కొబ్బ‌రి నూనెలో క‌లిపి త‌ల‌కు ప‌ట్టించి అర‌గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా బొప్పాయి గింజ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts