Jaggery : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని తయారు చేయడానికి పంచదారతో పాటు బెల్లాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. తీపి వంటకాల తయారీలో ఉపయోగించి ఈ బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బెల్లంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పూర్వకాలంలో బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగించే వారు. అందుకే వారు అంత దృఢంగా ఉండే వారు. బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినప్పటికి దీనిని ఎలా తీసుకోవాలో మనలో చాలా మందికి తెలిసి ఉండదు. రోజూ ఉదయం పరగడుపున ఒక చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఈ విధంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు కలుగుతుంది. అయితే ఆహారంగా ఎర్రగా, డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండే బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. తెల్లగా, పసుపు రంగులో ఉండే బెల్లాన్ని ఉపయోగించకూడదు. రోజూ ఉదయం పరగడుపున చిన్న నిమ్మకాయంత బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలో మలినాలు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో దాదాపు 150 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు విష వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. దీంతో మనం షుగర్, రక్తపోటు, థైరాయిడ్, చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున బెల్లం ముక్క తీసుకోవడం వల్ల శరీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. అంతేకాకుండా మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు ధృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా రోజూ బెల్లాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. నాడీ మండల వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా బెల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.