Piles : మనల్ని వేధించే అనారోగ్య సమస్యలల్లో ఫైల్స్ సమస్య కడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఫైల్స్ సమస్యతో బాధపడే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. ఫైల్స్ కారణంగా మలవిసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం, దురద కూడా కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గర్భిణీ స్త్రీలల్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు, ఇతరత్రా అనారోగ్యయ సమస్యలు, రోజంతా కూర్చొని పని చేయడం వంటి, నీటిని తక్కువగా తాగడం, ఫాస్ట్ ఫుడ్ ను, వేపుళ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల చేత కూడా ఫైల్స్ సమస్య బారిన పడే అవకాశం ఉంది.
మన జీవన విధానంలో అలాగే ఆహారపు అలవాట్లల్లో మార్పు చేసుకుంటూ కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ ఫైల్స్ సమస్య నుండి బయటపడవచ్చు. ఫైల్స్ ను నివారించే ఒక చక్కటి ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం గానూ మనం నల్లటి ఎండు ద్రాక్షలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో 4 లేదా 5 ఎండు ద్రాక్షలను తీసుకుని వాటిలో అర గ్లాస్ నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ ద్రాక్షలను తిని నీటిని తాగాలి. ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టడం వల్ల వీటిలో ఫైబర్ శాతం మరింత పెరుగుతుంది.
వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్దకం సమస్య తగ్గడం వల్ల క్రమంగా ఫైల్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నెలల పాటు పాటించడం వల్ల ఫైల్స్ సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల భవిష్యత్తులో కూడా ఫైల్స్ సమస్య రాకుండా ఉంటుంది. ఫైల్స్ సమస్య కారణంగా చాలా మంది రక్తహీనత సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఈ రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఎండు ద్రాక్షను ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. కాలేయంలోని విష పదార్థాలు తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది.
ఎండు ద్రాక్షలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పోషకాహార సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చిట్కాను పాటిస్తూనే మనం తీసుకునే ఆహారంలో అలాగే మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. పీచు పదార్థాలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్ కు, వేపులకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల ఫైల్స్ సమస్య తగ్గు ముఖం పట్టడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.