Reddyvari Nanubalu : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క.. పిచ్చి మొక్క కాదు.. విడిచిపెట్టకుండా తెచ్చుకుని ఇలా వాడండి..!

Reddyvari Nanubalu : మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వరకు పిచ్చి మొక్కలే ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఔషధ గుణాలు కలిగి ఉండే మొక్కల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో రెడ్డివారి నానుబాలు మొక్క కూడా ఒకటి. ఇది మన చుట్టూ ప్రకృతిలో ఎక్కడ చూసినా సరే కనిపిస్తూనే ఉంటుంది. పొలాలు, చేల గట్ల మీద, గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ మొక్క కనబడితే విడిచిపెట్టకండి. దీన్ని ఇంటికి తెచ్చుకోండి. దీంతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. రెడ్డివారి నానుబాలు మొక్కను ఉపయోగించి ఏయే వ్యాధులను ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్డివారి నానుబాలు మొక్క ఆకులు లేదా కాండాన్ని తెంచినప్పుడు పాలు వస్తాయి. ఇవి మనకు ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ మొక్క రెండు రకాలుగా ఉంటుంది. కొన్ని చిన్న ఆకులను, పువ్వులు లైట్‌ రెడ్‌ కలర్‌ను కలిగి ఉంటాయి. ఇక కొన్ని మొక్కల ఆకులు పెద్దగా ఉంటాయి. వీటి కలర్‌ లేత ఎరుపుగా ఉంటుంది. ఇలా ఆకులు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఎలాంటి రెడ్డివారి నానుబాలు మొక్క అయినా సరే మనకు ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే..

Reddyvari Nanubalu plant ayurvedic remedies
Reddyvari Nanubalu

ఆస్తమా ఉన్నవారికి రెడ్డివారి నానుబాలు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకులను తెంచి శుభ్రంగా కడిగి వాటితో డికాషన్‌ తయారు చేయాలి. దీన్ని రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. దీంతో ఆస్తమా నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. అలాగే దగ్గు ఉన్నవారికి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు జలుబు నుంచి కూడా బయట పడవచ్చు.

బ్లడ్‌ షుగర్‌ను తగ్గించడంలోనూ మనకు రెడ్డివారి నానుబాలు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని డికాషన్‌ను తాగుతుంటే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. అలాగే ఈ ఆకులను తీసుకుంటే విరేచనాల వంటి సమస్య నుంచి బయట పడవచ్చు.

రెడ్డివారి నానుబాలు మొక్క ఆకులను పేస్ట్‌గా చేసి రాస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ మొక్క పాలను రాయడం వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఇలా ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని వాడే ముందు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే అలర్జీలు సంభవించవచ్చు.

Editor

Recent Posts