సోరియాసిస్ అనేది ఒక చర్మ సంబంధిత సమస్య. ఇది ఒకరి నుండి మరొకరికి స్ప్రెడ్ అవ్వదు కాకపోతే చర్మం పై రెడ్ కలర్ స్పాట్స్ వంటివి ఏర్పడతాయి. దీంతో కొద్దిగా నొప్పి మరియు మంట కూడా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువైతే రక్తం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సమస్యను పూర్తిగా నివారించడం కష్టమనే చెప్పవచ్చు. కాకపోతే రిలీఫ్ కోసం వీటిని తప్పక ప్రయత్నించండి.
ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ మాత్రమే కాకుండా సోరియాసిస్ సమస్యను కూడా చెక్ పెట్టవచ్చు. ఎప్సన్ సాల్ట్ ను గోరువెచ్చని నీటిలో కలిపి సోరియాసిస్ మచ్చలు పై రాయడం వలన ఉపయోగం ఉంటుంది. పసుపులో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధించిన సమస్యలను పసుపు తో నివారించవచ్చు. కనుక మీ రోజు వారి ఆహారంలో భాగంగా దీనిని తీసుకోండి.
సొరియాసిస్ సమస్య కి కూడా పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. టీ ట్రీ ఆయిల్ ను సొరియాసిస్ మచ్చల పై రాయడం వలన చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. సొరియాసిస్ మచ్చల పై అలోవెర జెల్ ను ఉపయోగిస్తే చాల ప్రయోజనం ఉంటుంది అని రీసెర్చ్ లో తేలింది. వెయిట్ లాస్ కి ఉపయోగించే ఓట్స్ సోరియాసిస్ సమస్య కి కూడా బాగా పనిచేస్తాయి. కనుక స్నానం చేసే నీటి లో ఓట్స్ పొడి ను మిక్స్ చేసి ఈ సమస్యను చెక్ పెట్టండి.