చిట్కాలు

Rice Water For Beauty : బియ్యం కడిగిన నీళ్లతో.. అందాన్ని రెట్టింపు చేసుకోండి.. మొటిమలు, మచ్చలు కూడా పూర్తిగా మాయం..!

Rice Water For Beauty : చాలామంది, అనేక రకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే, ప్రతి ఒక్కరు కూడా, అందంగా కనపడాలని అనుకుంటూ ఉంటారు. అందంగా కనపడటం కోసం, అనేక రకాల చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. మీరు కూడా, మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా, ఇలా చేయండి. మనం బియ్యాన్ని కడిగి ఆ నీళ్ళని పారబోస్తూ ఉంటాం. కానీ, నిజానికి బియ్యం కడిగిన నీళ్లు వలన ఎన్నో లాభాలు ఉంటాయి. చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు. బియ్యం కడిగి, మనం అన్నం రోజు తింటాము. కానీ ఆ నీళ్ళని పారబోస్తూ ఉంటాము. కానీ, బియ్యం కడిగిన నీళ్ళని ఇలా వాడుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్లలో పోషకాలు ఎక్కువ ఉంటాయి.

విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. బియ్యం కడిగిన నీటిని ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యాన్ని ముందు గిన్నెలో పోసి, నీళ్లు పొయ్యాలి. రెండు సార్లు కడిగితే దుమ్ము అంతా పోతుంది. ఇప్పుడు మళ్ళీ నీటిని పోసి, ఒక అరగంట అలా వదిలేయాలి. అరగంట అయ్యాక బియ్యం కలపండి. కాస్త మసకగా నీళ్లు తేలుతాయి. ఈ నీటిని ఇంకో పాత్రలోకి వేసుకోవాలి. అంతే బియ్యం కడిగిన నీళ్లు రెడీ అయిపోయాయి.

Rice Water For Beauty how to use this

నీటిని మీరు ఫ్రిజ్లో పెట్టుకుంటే, రెండు మూడు రోజులు వాడుకోవడానికి అవుతుంది. బియ్యం కడిగిన నీళ్ళని ఉపయోగించడం వలన మొటిమలు కూడా తగ్గిపోతాయి. బియ్యం కడిగిన నీళ్ళల్లో కాటన్ ముంచి ముఖానికి, మెడకి రాసుకుని కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి. ముఖం పూర్తిగా ఆరిపోయాక, నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేయడం వలన, చర్మం కాంతివంతంగా మారుతుంది.

మృదువుగా తయారవుతుంది. కాటన్ ముంచి, మొటిమలు ఉన్నచోట రాస్తే, మొటిమలు పూర్తిగా తగ్గుతాయి. నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీళ్లు టోనర్ గా కూడా పనిచేస్తాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎలర్జీ వంటి సమస్యలు కూడా ఉండవు. తలస్నానం చేసిన తర్వాత, బియ్యం కడిగిన నీళ్ళని తల మీద పోసుకుని రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే, జుట్టుకు పోషణ అందుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

Admin

Recent Posts