Skin Tags : కాఫీ పొడితో ఇలా చేస్తే చాలు.. పులిపిర్లు వెంట‌నే రాలిపోతాయి..!

Skin Tags : మ‌న‌లో చాలా మంది చ‌ర్మంపై పులిపిర్ల స‌మ‌స్య‌తో బాధప‌డుతూ ఉంటారు. ఈ పులిపిర్లు శ‌రీరంలో ఏ భాగంలోనైనా వ‌స్తాయి. ముఖం, మెడ వంటి భాగాల్లో మాత్రం మ‌రింత ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే ఈ పులిపిర్లు హ్యూమ‌న్ పాపిలోనా వైర‌స్ అనే వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా వ‌స్తాయి. గాయాలు, దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు ఈ వైర‌స్ శ‌రీరంలోకి ప్రవేశించి క‌ణాల‌న్ని ఒకే ద‌గ్గ‌ర ప‌రిగేలా చేస్తుంది. ఈ క‌ణాల‌న్ని చ‌ర్మంపై పెరిగి గట్టిప‌డి క్ర‌మంగా పులిపిర్లుగా మార‌తాయి. వీటిని ఇంగ్లీష్ లో వార్ట్స్ అని అంటారు. అలాగే ఈ పులిపిర్లు చ‌ర్మంపై ఒక చోట నుండి మ‌రో చోటుకు వ్యాపిస్తాయి.

అలాగే ఇవి ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ్యాపిస్తాయి. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారిలో, చ‌ర్మం పొడిగా ఉండే వారిలో పులిపిర్లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. చాలా మంది పులిపిర్ల‌ను గిల్ల‌డం, బ్లేడుతో క‌ట్ చేయ‌డం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక‌టి లేదా రెండు పులిపిర్లు ఉన్న‌వారు చ‌ర్మ వైద్యుల‌ను క‌లిసి త‌గిన చికిత్స తీసుకోవ‌డం మంచిది. ఎక్కువ సంఖ్య‌లో పులిపిర్లు ఉన్న‌వారు ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల పులిపిర్లను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల పులిపిర్లు వాటంత‌ట అవే రాలిపోతాయి. అలాగే ఎటువంటి దుష్ప్ర‌భావాలు, నొప్పి, బాధ కూడా ఉండ‌వు.

Skin Tags wonderful home remedy in telugu
Skin Tags

పులిపిర్ల‌ను తొల‌గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఆర్గానిక్ ప‌సుపు, వంట‌సోడాను, సున్నాన్ని తీసుకోవాలి. ఈ మూడింటిని స‌మానంగా తీసుకుని అందులో నిమ్మ‌ర‌సం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఇందులో కాఫీ పొడిని వేసి క‌ల‌పాలి. కాఫీ పొడిని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎర్ర‌గా మార‌కుండా, చ‌ర్మం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని దూదితో లేదా ఇయ‌ర్ బ‌డ్ తో పులిపిర్ల‌పై రాయాలి. ఈ మిశ్ర‌మం ఆరిన త‌రువాత మ‌ర‌లా రాస్తూ ఉండాలి.

ఇలా 5 నుండి 6 సార్లు రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పులిపిర్లు రాలిపోతాయి. అలాగే పులిపిర్ల‌ను త‌గ్గించే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు దీని కోసం 4 వెల్లుల్లి రెబ్బ‌ల నుండి ర‌సాన్ని తీసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మ‌ర‌సం, వంట‌సోడా, సున్నం క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్ర‌మాన్నిదూదితో లేదా ఇయ‌ర్ బ‌డ్ తో పులిపిర్ల‌పై రాయాలి. ఈ మిశ్ర‌మం ఆరే కొద్ది మ‌ర‌లా రాస్తూ ఉండాలి. ఇలా 5 నుండి 6 సార్లు చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చిన్న‌గా ఉండే పులిపిర్లు ఒక్క‌రోజూలోనే రాలిపోతాయి. పెద్ద‌గా ఉండే పులిపిర్లు 2 నుండి 3 రోజుల్లో రాలిపోతాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా పులిపిర్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts