ఉబ్బసం లేదా ఆస్తమా అనేది ఒక తీవ్రమైన శ్వాసకోస వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఈ సమస్యను వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ చూడవచ్చు. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం ఎక్కువగా రావడం. ఈ వ్యాధి కారణంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరిని అడ్డుకుంటాయి. అయితే ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని అలర్జీలను కలిగించే పదార్థాలను కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా పొగాకు, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన వంటి వాటిని కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వల్ల పిల్లి కూతలు, ఆయాసం, ఛాతిలో పట్టేసినట్టు ఉండడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచం కలిగించే మందులు సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్టుగానే తగ్గి మళ్లీ వచ్చేయడం ఉబ్బసం ప్రధాన లక్షణం. ఇందువల్ల ఈ వ్యాధి బారిన పడిన వారు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ఉబ్బసం వ్యాధిని సహజసిద్ధంగా కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కుంకుడు గింజల్లోని పప్పు ఈ వ్యాధిని నయం చేయడంలో అద్భుతంగా పని చేస్తుందని వారు చెబుతున్నారు. ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు కుంకుడు గింజల్లోని పప్పును ప్రతిరోజూ సేవిస్తూ ఉంటే ఉబ్బసం వ్యాధి క్రమంగా నయం అవుతుందట. కుంకుడు కాయలను పూర్వకాలంలో ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుత కాలంలో వీటిని ఉపయోగించే వారు తక్కువైయ్యారు. తలస్నానం చేయడానికి షాంపూలను వాడడానికి బదులుగా కుంకుడుకాయలను వాడడమే మంచిది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చుండ్రు, పేలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
కుంకుడు కాయల్లోని పప్పును తినడం వల్ల ఉబ్బసం వ్యాధి తగ్గుతుందని కొంతమంది వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు. కుంకుడు గింజలో ఉండే పప్పులోని ఔషధ గుణాలు ఉబ్బసం వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి ఉబ్బసాన్ని తగ్గిస్తాయని వారు తెలియజేస్తున్నారు. కుంకుడు కాయలతోపాటు ఉబ్బసాన్ని తగ్గించడంలో వెల్లుల్లి రసం కూడా అద్భుతంగా పని చేస్తుందట. అలాగే చక్కర కేళి అరటి పండులో గోమూత్రాన్ని కలుపుకుని తాగినా కూడా ఉబ్బసం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.