Super Fast Hair Growth : ఈ నూనెను రాశారంటే చాలు.. జుట్టు ఒత్తుగా 7 అడుగులు పెర‌గ‌డం ఖాయం..!

Super Fast Hair Growth : మ‌న‌కు చాలా సుల‌భంగా ల‌భించే రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా పెరుగుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డు వారు వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పెర‌గ‌డ‌క‌పోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వివిధ ర‌కాల కార‌ణాల చేత జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇటువంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు ఇంట్లోనే కేవ‌లం రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టును ఒత్తుగా, అందంగా మార్చుకోవ‌చ్చు.

జుట్టును ఒత్తుగా మార్చే ఈ నూనెను త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం కొబ్బ‌రి నూనెను, కాళోంజి విత్త‌నాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. కాళోంజి విత్త‌నాల‌లో ఎన్నో పోష‌కాలు, ఆమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుద‌ల‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా, న‌ల్ల‌గా పెర‌గ‌డంలో కాళోంజి విత్త‌నాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే కొబ్బ‌రి నూనెలో కూడా ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుద‌ల‌లో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల జుట్టు పొడ‌వుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ రెండు ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 8 టీ స్పూన్ల కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి.

Super Fast Hair Growth use this hair oil
Super Fast Hair Growth

త‌రువాత ఇందులో 2 టీ స్పూన్ల కాళోంజి విత్త‌నాల‌ను వేసి క‌ల‌పాలి. ఈ నూనెను డ‌బుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో వేడి చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ముందుగా త‌యారు చేసుకున్న కొబ్బ‌రి నూనె గిన్నెను నీటిలో ఉంచి నెమ్మ‌దిగా క‌లుపుతూ నూనెను వేడి చేయాలి. ఇలా 5 నిమిషాల పాటు నూనెను వేడి చేసిన త‌రువాత దీనిని బ‌య‌ట‌కు తీసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టేలా బాగా ప‌ట్టించాలి. ఇలా రాత్రి ప‌డుకునే ముందు జుట్టుకు ప‌ట్టించి ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా పెరుగుతుంది.

Share
D

Recent Posts