Kaju Masala Biscuits : కారంగా ఉండే ఈ కాజు మ‌సాలా బిస్కెట్ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Kaju Masala Biscuits : మ‌న‌కు బేక‌రీల‌లో, స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో కాజు బిస్కెట్లు కూడా ఒక‌టి. వీటిని మైదాపిండి కాజు బిస్కెట్లు అని కూడా అంటారు. ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ బిస్కెట్ల‌ను ఇష్టంగా తింటారు. ఈ కాజు బిస్కెట్ల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఈ బిస్కెట్లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. పిల్ల‌లు వీటిని మరింత ఇష్టంగా తింటారు. గుల్ల గుల్ల‌గా రుచిగా ఉండేలా ఈ కాజు బిస్కెట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – పావు కిలో, వాము – అర చెంచా, వంట‌సోడా – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, క‌రిగించిన డాల్డా – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, కారం – ఒక టీ స్పూన్, న‌ల్ల ఉప్పు – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్.

Kaju Masala Biscuits recipe you can make at home
Kaju Masala Biscuits

కాజు బిస్కెట్ల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో వామును న‌లిపి వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, వంట‌సోడా, డాల్డా వేసుకుని బాగా క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని వీలైనంత గ‌ట్టిగా క‌లుపుకోవాలి. పిండిని 5 నిమిషాల పాటు బాగా క‌లుపుకున్న త‌రువాత దానిపై త‌డి వ‌స్త్రాన్ని క‌ప్పుకుని అర గంట పాటు ఉంచాలి. పిండి చ‌క్క‌గా నానిన త‌రువాత దీనిని మ‌రోసారి క‌లుపుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ 2 ఎమ్ ఎమ్ మందంతో చ‌పాతీలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న త‌రువాత అంచు ప‌దునుగా ఉండే బాటిల్ మూతతో చ‌పాతీని ఒక అంచు నుండి కాజు బిస్కెట్ల ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని క‌ట్ చేసుకున్న త‌రువాత మిగిలిన పిండిని మ‌రోసారి చ‌పాతీలా వత్తుకుని మ‌ర‌లా బిస్కెట్ల‌ను క‌ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక స్ట‌వ్ ఆఫ్ చేసి బిస్కెట్ల‌ను వేసుకోవాలి. బిస్కెట్లు వేగి పైకి తేలిన త‌రువాత స్ట‌వ్ ఆన్ చేసి చిన్న మంట‌పై చిల్లుల గంటెతో నూనెపై త‌డుతూ బిస్కెట్ల‌ను వేయించుకోవాలి. ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న త‌రువాత మంట‌ను పెద్ద‌గా చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని బిస్కెట్ల‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కాజు బిస్కెట్లు త‌యార‌వుతాయి. ఈ బిస్కెట్ల‌ను ఇలాగే నేరుగా తిన‌వ‌చ్చు లేదా కారం, న‌ల్ల ఉప్పు, చాట్ మ‌సాలా వేసి క‌లిపి తిన‌వ‌చ్చు. మ‌సాలాలు బిస్కెట్ల వేడిగా ఉన్న‌ప్పుడే వేసి క‌లుపుకోవాలి. బిస్కెట్లు పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు బిస్కెట్లు త‌యార‌వుతాయి. ఈ బిస్కెట్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts