Sweat Smell : మనకు చెమట రావడం సర్వ సాధారణం. వాతావరణంలో వేడి, తేమ ఎక్కువగా ఉంటే మనకు చెమట వస్తుంది. ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు మన శరీరంలో ఎక్కువగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని మన శరీరం చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. దీంతో మన శరీరం చల్లబడుతుంది. మన శరీరంలో అనేక శ్వేద గ్రంథులు ఉంటాయి. ఈ శ్వేద గ్రంథులు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. చంక కింది భాగంలో ఉండే శ్వేద గ్రంథులు చాలా చురుకుగా పని చేస్తాయి. అందువల్ల మనకు చంక కింది భాగంలో అధికంగా చెమట వస్తుంది. ఈ చెమటలో ప్రోటీన్స్, యాంటీ యాసిడ్లు అధికంగా ఉండడం వల్ల బట్టలపై చెమట మరకలు ఏర్పడుతాయి.
మానవ శరీరం నిర్వహించే ముఖ్యమైన విధులల్లో చెమటను బయటకు పంపించడం ఒక్కటి. చెమటలో ఉండే రసాయనాలు మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి. చెమటలో ఉండే సహజసిద్ధమైన యాంటీ బయోటిక్స్ క్రిములను చంపి మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. కొంత మంది వ్యక్తులలో అధికంగా చెమట ఉత్పత్తి అవుతుంది. ఈ స్థితిని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఈ చెమట వాసన కలిగి ఉండి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ సమస్య నుండి బయట పడడానికి మనం డియోడరెంట్లను, యాంటీ పెర్‌స్పిరెంట్లను వాడుతూ ఉంటాం.
డియోడరెంట్లలో రసాయనాలను అధికంగా వాడతారు. ఇవి మన శరీరానికి ఎంతో హాని చేస్తాయి. వీటిని వాడడం వల్ల మనకు రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కనుక వీటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలను వాడాలి. వాటిల్లో నిమ్మకాయ ఒకటి.
ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయను డియోడరెంట్‌గా వాడడం వల్ల చెమట వాసన రాకుండా ఉంటుంది. మధ్యస్తంగా పండిన ఒక నిమ్మకాయను తీసుకొని రెండు భాగాలుగా చేసి చంక కింది భాగంలో బాగా రుద్ది కొన్ని నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చెమట వాసన రాకుండా ఉండడమే కాకుండా చంక కింది భాగంలో ఉండే చర్మానికి ఎటువంటి హాని కలగదు.
ఇలా చేయడం వల్ల నిమ్మకాయలో ఉండే ఆమ్లాలు చంక కింది భాగంలో ఎక్కువ చెమట ఉత్పత్తి కాకుండా చేస్తాయి. దీంతో నిమ్మకాయలు సహజ సిద్దమైన డియోడరెంట్లుగా పని చేస్తాయి. నిమ్మకాయల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల చెమట వాసన రాకుండా ఉంటుంది. చెమట అధికంగా వచ్చేవారు, చెమట వాసనగా ఉండేవారు.. నిమ్మకాయను ఈ విధంగా వాడడం వల్ల సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.