Engineers Veg Biryani : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలను చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే వారిలో కొందరికి మాత్రం ఇలా ఉద్యోగాలు చేయడం నచ్చడం లేదు. దీంతో వారు చేస్తున్న ఉద్యోగాలను మానేసి సొంతంగా చిన్న వ్యాపారం అయినా సరే చేసుకుంటున్నారు. అలాగే ఓ ఇద్దరు ఇంజినీర్లు కూడా చేస్తున్న ఉద్యోగాలను మానేసి చిన్న బిర్యానీ సెంటర్ పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము గతంలో చేసిన జాబ్‌ల కన్నా ఈ బిజినెస్ ద్వారానే డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని సోనిపట్‌కు చెందిన రోహిత్, సచిన్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ చదివారు. ఒకే కంపెనీలో జాబ్ చేసేవారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు చేసేవారు. రూ.లక్షల్లో జీతాలు కూడా వచ్చేవి. కానీ వారికి ఆ జాబ్‌లు నచ్చలేదు. దీంతో వారు ఆ ఉద్యోగాలను మానేశారు. సొంతంగా చిన్న బిర్యానీ సెంటర్ పెట్టారు. అంతే వారి ఐడియా చాలా బాగా క్లిక్ అయింది. ఆ బిర్యానీ సెంటర్ ద్వారా డబ్బు బాగానే సంపాదిస్తున్నారు.
వారి బిర్యానీ సెంటర్‌కు వారు ఒక పేరు కూడా పెట్టారు. అదే.. ఇంజినీర్స్ వెజ్ బిర్యానీ. వీరి సెంటర్‌లో రెండు రకాల బిర్యానీలు లభిస్తాయి. ఒకటి వెజ్ బిర్యానీ కాగా ఇంకొకటి అచారీ వెజ్ బిర్యానీ. ఏది తీసుకున్నా హాఫ్ ప్లేట్ రూ.50, ఫుల్ ప్లేట్ రూ.70 తీసుకుంటారు. ఈ క్రమంలోనే బిర్యానీ ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకనే వీరి సెంటర్ తక్కువ కాలంలోనే వృద్ధిలోకి వచ్చింది. దీంతో వీరు ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నారు. గతంలో జాబ్ లు చేసినప్పటి కన్నా ఎక్కువగానే ఇప్పుడు సంపాదిస్తున్నామని చెబుతున్నారు. ఇంకా ఈ సెంటర్ వారి సొంతం కనుక చాలా సంతోషంగా పనిచేసుకుంటున్నామని, ఎలాంటి ఒత్తిడి లేదని అంటున్నారు. అవును.. తెలివిగా.. కష్టపడి.. జాగ్రత్తతో సొంతంగా ఏ పనిచేసినా.. అది కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. వారు కూడా ఇదే చేసి చూపించారు. ఈ క్రమంలోనే వీరి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.