Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్ సినిమాలు అంటే సహజంగానే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ స్పైడర్ మ్యాన్ చేసే సాహసాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హాలీవుడ్ టాప్ హీరో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. గతేడాది డిసెంబర్ 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కని విజయాన్ని అందుకుంది. మన దేశంలోనూ ఈ మూవీ భారీగానే కలెక్షన్లను వసూలు చేసింది.
కాగా భారత్‌లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమా ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో ఈ హాలీవుడ్ మూవీకి ఇంతటి కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారతీయ సినిమాలకు పోటీగా ఈ మూవీ కలెక్షన్లను వసూలు చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రానుంది.
స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమా బుక్ మై షోలో స్ట్రీమ్ కానుంది. దీన్ని వీడియో ఆన్ డిమాండ్ పద్ధతిలో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ మూవీని ప్రస్తుతం ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక మార్చి 23 నుంచి ఈ మూవీని బుక్ మై షో యాప్ లో స్ట్రీమ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు జాన్ వాట్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఇది అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడం విశేషం.