Baking Soda Water : ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వంట‌సోడాను క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Baking Soda Water : వంట‌సోడా.. బ‌జ్జీ, బొండా, పునుగులు వంటి వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌న ఆరోగ్యంతోపాటు శారీర‌క అందాన్ని కాపాడ‌డంలో కూడా వంట‌సోడా మ‌న‌కు ఉప‌క‌రిస్తుంది. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. గోర్ల‌ల్లో మ‌ట్టి చేరిన‌ప్పుడు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా వంట‌సోడాను వేసి ఆ నీటిలో కొద్ది సేపు చేతుల‌ను ఉంచాలి. త‌రువాత స్క్ర‌బ‌ర్ తో శుబ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల గోర్ల‌ల్లో ఉండే మురికి పోతుంది. చేతుల‌పై ఉండే మృత‌క‌ణాలు కూడా తొల‌గిపోతాయి. శ‌రీరానికి కూడా వంట‌సోడా ఎంతో మేలు చేస్తుంది.

అల‌సట ఉన్న వారు ఒక బ‌కెట్ వేడి నీటిలో ఒక క‌ప్పు వంట‌సోడాను క‌లిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అల‌సట‌, ఒత్తిడి మాయ‌మ‌వుతాయి. ఇలా స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంపై ఉండే మురికి, మృత క‌ణాలు కూడా తొల‌గిపోతాయి. చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది. వంట‌సోడాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ వంట‌సోడాను క‌లిపి తాగితే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా వంట‌సోడాను నీటిలో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గుండెల్లో మంట త‌గ్గుతుంది. గుండెలో మంట ఎసిడిటీ వ‌ల్ల క‌లుగుతుంది. ఒక టీ స్పూన్ వంట‌సోడాను, ఒక గ్లాస్ నీటిలో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ వ‌ల్ల క‌లిగే గుండె మంట త‌గ్గి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

take Baking Soda Water know what happens and its benefits
Baking Soda Water

వంట‌సోడాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అల‌ర్జీలు, చ‌ర్మం క‌మిలిపోవ‌డం వంటి వాటిని త‌గ్గించ‌డంలో వంట‌సోడా దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. వంట‌సోడాలో కొద్దిగా నీటిని క‌లిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చ‌ర్మంపై లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల ఎటువంటి చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లైనా త‌గ్గుతాయి. అలాగే శ‌రీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌వ‌డం వ‌ల్ల కీళ్ల మ‌ధ్య నొప్పి లాగా వ‌స్తుంది. దీనినే గౌట్ అంటారు. ఈ గౌట్ నొప్పిని కూడా వంట‌సోడా తగ్గిస్తుంది. ఒక స్పూన్ వంట‌సోడాను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల గౌట్ వ‌ల్ల క‌లిగే నొప్పి త‌గ్గుతుంది. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు కూడా క‌రిగిపోతాయి. అలాగే మూత్ర‌పిండాల్లో కొత్త‌గా రాళ్లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

క్యాన్స‌ర్ ఉన్న వారికి వంట‌సోడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ వంట‌సోడాను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా నీటిలో వంట‌సోడాతో పాటు తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి ఒక వారం రోజుల పాటు ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జ‌రిగే మార్పులను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. వంట‌సోడాలో ఉండే ర‌సాయ‌నిక ల‌క్ష‌ణాలు మ‌న‌ల్ని వ్యాధుల నుండి ర‌క్షిస్తాయి. నిమ్మ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సి యాంటీ బ‌యాటిక్ గా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతుంది. ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారాలు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి.

అలాగే వంట‌సోడా క‌లిపిన గోరు వెచ్చ‌ని నీటిని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి త‌గ్గుతుంది. వంట‌సోడా మ‌న‌కు డియోడ్రెంట్ గా కూడా ప‌ని చేస్తుంది. వంట‌సోడాలో కొద్దిగా నీటిని పోసి క‌లుపుకోవాలి. దూదిని తీసుకుని ఈ మిశ్ర‌మంలో ముంచి శ‌రీరంలో చెమ‌ట‌, దుర్వాస‌న వచ్చే చోట రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరం నుండి దుర్వాస‌న రావ‌డం త‌గ్గుతుంది. అదే విధంగా వంట‌సోడా క‌లిపిన నీటితో చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల క్రిములు న‌శించి చేతులు శుభ్ర‌ప‌డ‌తాయి. మ‌నం వంట‌సోడాను ఉప‌యోగించి మ‌నం ముఖ అందాన్ని పెంచుకోవ‌చ్చు. వంటసోడా చ‌క్క‌టి ఫేషియ‌ల్ స్క్ర‌బ‌ర్ లా కూడా ప‌ని చేస్తుంది.

పొడి చ‌ర్మం ఉన్న వారికి వంట‌సోడా చ‌క్క‌టి వ‌రంలా ప‌ని చేస్తుంది. ఒక గిన్నెలో వంట‌సోడాను, తేనెను వేసి పేస్ట్ లా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. 20 నిమిషాల త‌రువాత ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఈ ఫేషియ‌ల్ ను వారానికి ఒకసారి వేసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ చిట్కా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చ‌డంతోపాటు చ‌ర్మంపై ఉండే మొటిమ‌లను కూడా త‌గ్గిస్తుంది. అదేవిధంగా మ‌నం రోజూ 8 గంట‌ల పాటు నిద్రించ‌డం చాలా అవ‌స‌రం. మ‌నం ఎక్కువ‌గా బెడ్ పైన నిద్రిస్తూ ఉంటాం. కానీ బెడ్ మీద మ‌న‌కు క‌నిపించని దుమ్ము, ధూళి, పురుగులు, బ్యాక్టీరియా వంటివి ఎన్నో ఉంటాయి.

వీటిని అలాగే వ‌దిలేయ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్యాల పాల‌వుతాము. క‌నుక మ‌నం నిద్రించే ప‌రుపును ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. వంట‌సోడాను ఉప‌యోగించి మ‌నం సులువుగా ప‌రుపును శుభ్ర‌ప‌రుచుకోవ‌చ్చు. దీనికోసం మ‌నం 200 గ్రా. ల వంట‌సోడాను ఒక జ‌ల్లెడ‌లోకి తీసుకుని ప‌రుపుపై చ‌ల్లాలి. ఇలా చ‌ల్లిన 10 నిమిషాల త‌రువాత వ్యాక్యూమ్ క్లీన‌ర్ తో ప‌రుపును శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సోడాతో స‌హా బ్యాక్టీరియా ప‌రుపును వ‌దిలిపోతుంది. ప‌రుపు శుభ్ర‌ప‌డ‌డంతోపాటు చ‌క్క‌టి వాస‌న కూడా వ‌స్తుంది.

అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వంట‌సోడా, వాషింగ్ పౌడ‌ర్, కొద్దిగా వెనిగ‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. దీనిని సోఫా, బెడ్, కార్పెట్ వంటి వాటిపై ఎక్క‌డ శుభ్రం చేయాల‌నుకుంటే అక్క‌డ ఈ మిశ్ర‌మాన్ని స్ప్రే చేయాలి. త‌రువాత ఒక స్పాంజ్ తో శుభ్రప‌రుచుకోవాలి. ఈ విధంగా వంట‌సోడా మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts