Ginger Water : అధిక బరువు సమస్య కారణంగా మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొందరిలో నడుము, తొడలు, పిరుదుల దగ్గర కొవ్వు పేరుకుపోతుంటుంది. దీని వల్ల చాలా మంది ఆత్మనూన్యత భావనకు కూడా గురి అవుతూ ఉంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల వారు తమకు నచ్చిన బట్టలను కూడా వేసుకోలేకపోతుంటారు. ఇలా భారీగా పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లం ప్రతి వంటింట్లో ఉపయోగించే వస్తువు. చాలా వేగంగా కొవ్వును కరిగించే శక్తి అల్లానికి ఉంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. నడుము, పిరుదులు, తొడల భాగంలో పేరుకున్న కొవ్వును తేలికగా కరిగిస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. దీని వల్ల కొవ్వు కరిగిపోతుంది.
పొట్టలో పిహెచ్ లెవల్స్ ను పెంచడంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. దీంతో మనం కడుపు ఉబ్బరం, మలబద్దకం సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. అదే విధంగా శరీరంలో జీవక్రియల రేటును పెంచే శక్తి కూడా అల్లానికి ఉంది. జీవక్రియ రేటు పెరిగితే చాలా త్వరగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు, కొవ్వు కరిగి నాజూకుగా తయారవ్వాలనుకునే వారు అల్లం నీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అల్లం నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసకుందాం.
ముందుగా ఒక గిన్నెలో లీటర్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఒక చిన్న అల్లం ముక్కను శుభ్రపరిచి ముక్కలుగా కోసి నీటిలో వేయాలి. ఈ నీటిని మరో 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిని చల్లార్చి వడకట్టి తాగాలి. ఈ నీటిని రోజంతా మామూలు నీటిలాగే తాగుతూ ఉండాలి. ఇలా మూడు నుండి నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడాన్ని గమనించవచ్చు. ఇలా చేయడం వల్ల తొడలు, పిరుదులు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతూ ఉంటుంది. ఈ అల్లం నీటిని ఏ రోజుకు ఆ రోజే తాజాగా తయారు చేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.