భారతీయులందరి ఇళ్లలోనూ అనేక రకాల మసాలా దినుసులు ఉంటాయి. వాటిల్లో కాలోంజి విత్తనాలు ఒకటి. వీటినే నైజెల్లా సీడ్స్ అంటారు. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కాలోంజితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే ఇవి అధిక బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. మరి అందుకు కాలోంజి విత్తనాలను ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. చిటికెడు కాలోంజి విత్తనాలను తీసుకుని పొడి చేయాలి. దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం అందులో ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉండగానే పరగడుపునే తాగేయాలి. ఇలా రోజూ చేస్తే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.
2. చిటికెడు కాలోంజి విత్తనాలను తీసుకుని ఒక పాత్రలో వేసి అందులో సగం నిమ్మకాయను పూర్తిగా పిండాలి. ఆ పాత్రను ఎండలో 1-2 రోజుల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు.
3. చిటికెడు కాలోంజి విత్తనాలను తీసుకుని వాటిని నేరుగా మింగేయాలి. వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. రోజూ ఉదయం ఇలా చేయాలి. అధిక బరువు తగ్గుతారు.
4. రాత్రి పూట కొన్ని కాలోంజి విత్తనాలను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ విత్తనాలను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు.
కాలోంజి విత్తనాలను ఎక్కువగా తీసుకోరాదు. మోతాదుకు మించితే జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక తగిన మోతాదులోనే వాటిని వాడుకోవాలి.