మన శరీరంలో రక్తం అనేక కీలక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలోని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లను రవాణా చేస్తుంది. అందువల్ల రక్తం శుభ్రంగా ఉండాలి. అందులో విష పదార్థాలు చేరకూడదు. కిడ్నీలు, లివర్ రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల రక్తంలో విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. కనుక రక్తాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలను పాటించాలి.
1. రక్తాన్ని శుద్ధి చేయడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఇది ఒక డిటాక్స్ డ్రింక్. అంటే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రంగా చేస్తుందన్నమాట. కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగుతుండాలి. శరీరం మొత్తం శుభ్రమవుతుంది. రక్తంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
2. ఒక ఖాళీ గ్లాస్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేయాలి. కొంత సేపు ఉంచితే బబుల్స్ వస్తాయి. ఆ సమయంలో నీటిని పోసి వెంటనే తాగేయాలి. రోజుకు ఒకసారి ఇలా చేయాలి. దీని వల్ల రక్తం పీహెచ్ స్థాయిలు మెరుగు పడుతాయి. రక్తం శుద్ధి అవుతుంది.
3. తులసి ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఈ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. తులసి ఆకుల రసాన్ని ఉదయం పరగడుపున 1 టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అందులో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్, కిడ్నీలు కూడా శుభ్రంగా మారుతాయి.
4. రోజూ రాత్రి పూట ఒక కప్పు గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తం శుద్ధి అవుతుంది.
5. రోజూ తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల కూడా రక్తంలోని మలినాలు బయటకు పోతాయి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకుంటున్నా రక్తం శుభ్రమవుతుంది. విష పదార్థాలు బయటకు పోతాయి.