Constipation : మలబద్దకం సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండడం.. గంటల తరబడి కూర్చుని పనిచేయడం.. థైరాయిడ్.. డయాబెటిస్.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం వస్తోంది. అయితే కింద తెలిపిన అద్భుతమైన చిట్కాను పాటిస్తే.. దాంతో మలబద్దకం సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కా ఏమిటంటే..
రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని ఆవు పాలలో 1 టీస్పూన్ ఆవు నెయ్యి కలిపి తాగాలి. ఈ మిశ్రమం మలబద్దకానికి అద్భుతంగా పనిచేస్తుంది. మరుసటి రోజు పేగులు మొత్తం క్లీన్ అవుతాయి. మలం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా రోజూ పాటిస్తే కొద్ది రోజులకు ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
అయితే రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు భోజనం చేసి నిద్రించడం.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం.. వంటి సూచనలు పాటిస్తే మలబద్దకం అన్న సమస్యే ఉండదు. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇతర జీర్ణ సమస్యలైన అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట కూడా ఉండవు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.