Sudigali Sudheer : సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్ నిజంగానే ప్రేమించుకుంటున్నారా ? ఇంద్ర‌జ కామెంట్స్ వైర‌ల్‌..!

Sudigali Sudheer : బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రేక్ష‌కుల‌ను ఇప్ప‌టికీ ఎంత‌గానో అల‌రిస్తోంది. అయితే షోలో ఉన్న బూతు, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ కార‌ణంగా కొంద‌రు ప్రేక్ష‌కులు ఈ షోకు దూర‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ఈ షోకు ఉన్న ఆద‌ర‌ణ త‌గ్గ‌డం లేదు. ఇక ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్‌ల మీద అనేక పంచ్‌లు వేస్తుంటారు. ముఖ్యంగా ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం చేస్తున్నారు. అయితే అదంతా ఏమీ లేద‌ని.. కేవ‌లం షో కోసమే వారు అలా చేస్తార‌ని.. ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ న‌టి ఇంద్ర‌జ చేసిన కామెంట్స్ మాత్రం మ‌రోలా ఉన్నాయి.

Sudigali Sudheer  and Rashmi Gautam love story is it real Indraja comments
Sudigali Sudheer

ఒక‌ప్పుడు టాలీవుడ్ తెర‌పై టాప్ హీరోయిన్ గా పేరుగాంచిన ఇంద్రజ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సెకండ్ ఇన్నింగ్స్‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగానే ఆమె జ‌బర్ద‌స్త్‌తోపాటు ప‌లు ఇత‌ర షోల‌లో క‌నిపిస్తోంది. ఇక ఈ మ‌ధ్యే సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా స్టాండ్ అప్ రాహుల్ అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్‌, వ‌ర్ష‌లు హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా ఈ నెల 18వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్లలో పాల్గొన్న ఇంద్ర‌జ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది. ముఖ్యంగా తాను పాల్గొంటున్న జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి విష‌యాల‌ను తెలియ‌జేసింది.

జ‌బ‌ర్ద‌స్త్ షోలో చేసే స్కిట్లు, వేసే జోకులు, పంచ్‌లు టీఆర్‌పీల కోసం కాద‌ని.. కొన్ని సార్లు రియ‌ల్‌గానే వాటిని చేస్తార‌ని.. ఒక్కో సారి ఆర్టిస్టులు స్టేజిపై త‌మ క‌ష్టాల‌ను చెప్పుకుని ఎమోష‌న‌ల్ అవుతుంటార‌ని.. తాము ఓదారుస్తామ‌ని.. అయితే అలాంటి సీన్ల‌ను ఎడిటింగ్‌లో తీసేస్తార‌ని.. క‌నుక జ‌బ‌ర్ద‌స్త్ లాంటి షోల వెనుక ఏం జ‌రిగేదీ.. అస‌లు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ద‌ని.. ఇంద్ర‌జ కామెంట్స్ చేసింది. ఇక ర‌ష్మి గౌత‌మ్‌, సుధీర్‌ల‌తోపాటు ఇత‌ర నటీన‌టుల మ‌ధ్య క్రియేట్ చేసే ప్రేమ క‌థ‌ల గురించి కూడా ఆమె మాట్లాడింది. అవ‌న్నీ నిజంగానే కొన్నిసార్లు ఉంటాయని.. కానీ ర‌ష్మి, సుధీర్‌ల మ‌ధ్య ఏం ఉంది ? అన్న‌ది వారినే అడ‌గాల‌ని చెప్పింది. అంటే.. ఈ షోల‌లో చూపించే కొంద‌రి ప్రేమ‌క‌థ‌లు నిజ‌మే అన్న విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మైంది. కానీ అంద‌రి ప్రేమ‌క‌థ‌లు నిజంగా ఉండ‌వు. మ‌రి ర‌ష్మి, సుధీర్‌ల‌ది నిజ‌మైన ప్రేమ‌క‌థా.. లేదా.. అనేది వారి మాట‌ల్లోనే వినాల్సి ఉంటుంది.

Editor

Recent Posts