Natural Hair Oil : రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెను రాయండి.. జుట్టు ఎంత పొడ‌వు పెరుగుతుందో మీరే చూస్తారు..

Natural Hair Oil : చిన్న వ‌య‌సులోనే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నేటి త‌రుణంలో ఎక్కువవుతున్నారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల‌, జుట్టు పెర‌గ‌డం ఆగిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లన్నింటిని మ‌నం ఇంటి చిట్కాతో త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా చేసే ఈ ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను కూడా తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మనం ఉల్లిపాయ‌ల‌ను, కొబ్బ‌రి నూనెను, జామ ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

దీని కోసం ముందుగా ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి. మ‌న జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఉల్లిపాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న జుట్టు ఎదుగుద‌ల‌కు కెరోటిన్ అనే ప‌దార్థం చాలా అవ‌స‌రం. ఈ కెరోటిన్ ఉత్ప‌త్తిని ప్రేరేపించే గుణాలు ఉల్లిపాయ‌లో పుష్క‌లంగా ఉంటాయి. అలాగే దీనిలో అధికంగా ఉండే స‌ల్ఫ‌ర్ జుట్టుకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చ‌క్క‌గా జ‌రిగేలా చేస్తుంది. జుట్టు చిట్ల‌డం, జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు ఉల్లిపాయ చ‌క్క‌టి ప‌రిష్కారం అని చెప్ప‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌ను ముక్క‌లుగా చేసిన తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్కకు పెట్టుకోవాలి. త‌రువాత 4 లేదా 5 జామ ఆకుల‌ను తీసుకుని వాటిని కూడా ముక్క‌లుగా చేసుకోవాలి. ఈ జామ ఆకుల్లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.

this Natural Hair Oil can get rid of all hair problems
Natural Hair Oil

ఇవి జుట్టుకు సంబంధించిన అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే జుట్టును ఆరోగ్యంగా చేయ‌డంలో జుట్టు కుదుళ్ల‌ను ధృడంగా చేయ‌డంలో మ‌న‌కు కొబ్బ‌రి నూనె కూడా ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఈ మూడు ప‌దార్థాలను ఉప‌యోగించి నూనెను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక క‌ప్పు నూనెను పోసి వేడి చేయాలి. నూనె గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌ల‌ను, జామ ఆకుల‌ను వేసి క‌ల‌పాలి. ఈ రెండింటిని చిన్న మంట‌పై 20 నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా వేడి చేయ‌డంలో వ‌ల్ల ఉల్లిపాయ‌ల్లో అలాగే జామ ఆకుల్లో ఉండే పోష‌కాలు నూనెలోకి వ‌స్తాయి. త‌రువాత వీటిని పూర్తిగా చల్లారే వ‌ర‌కు ఉంచి వ‌డక‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను రాత్రి ప‌డుకునే ముందు జుట్టు కుదుళ్ల‌కు, జుట్టుకు బాగా ప‌ట్టించి మ‌ర్దనా చేసుకోవాలి.

ఉద‌యాన్నే ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా కొద్ది రోజుల పాటు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల జుట్టు పెరుగుద‌ల‌లో వ‌చ్చిన మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పొడిబార‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు అందంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ ఖ‌ర్చులో అంద‌మైన ఒత్తైనా జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts