Triphala Churna : రోజూ అర టీస్పూన్ చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి.. బ‌రువు త‌గ్గుతారు..!

Triphala Churna : త్రిఫ‌ల చూర్ణం.. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద ఔష‌ధాల్లో ఇది ఒక‌టి. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించ‌డంలో ఇది మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేద వైద్యులు ఈ చూర్ణాన్ని స‌ర్వ‌రోగ నివారిణిగా అభివర్ణిస్తూ ఉంటారు. అజీర్తి, మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో త్రిఫ‌ల చూర్ణం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే వేడి వ‌ల్ల కొంద‌రిలో విప‌రీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ చూర్ణాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చూర్ణాన్ని కొబ్బ‌రి నూనెతో క‌లిపి తల‌కు, జుట్టుకు బాగా ప‌ట్టించాలి.

గంట త‌రువాత తేలిక‌పాటి షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అలాగే చ‌ర్మంపై వ‌చ్చే మొటిమ‌లను త‌గ్గించ‌డంలో, దంతాల నొప్పులను, పిప్పి ప‌న్నును నివారించ‌డంలో, అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో కూడా ఈ చూర్ణం మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ చూర్ణాన్ని క‌ర‌క్కాయ‌, తానికాయ‌, ఉసిరికాయ‌.. ఈ మూడింటితో వీటిని త‌యారు చేస్తారు. ఈ చూర్ణాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌నిషి ఆయువు కూడా పెరుగుతుంది. మ‌న‌కు వ‌చ్చే వాత‌, క‌ఫ‌, పిత రోగాల‌ను త‌గ్గించి సుఖ‌మైన జీవితాన్ని గ‌డిపేలా చేయ‌డంలో ఈ చూర్ణం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో, కాలేయాన్ని, పెద్ద ప్రేగును శుభ్రం చేయ‌డంలో ఈ చూర్ణం దోహ‌ద‌ప‌డుతుంది. మౌత్ వాష్ గా కూడా మ‌నం దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు.

Triphala Churna take daily half teaspoon
Triphala Churna

శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను, విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, రోజంతా ఉత్సాహంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో ఈ చూర్ణం మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది . అలాగే త్రిఫ‌లా చూర్ణాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించడంలో, ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మ‌నకు ఈ చూర్ణం ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ త్రిఫ‌లా చూర్ణాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చూర్ణాన్ని ఏ విధంగానైనా తీసుకోవ‌చ్చు. ఈ చూర్ణాన్ని పొడి రూపంలో, క్యాప్సుల్స్ రూపంలో, ద్ర‌వ రూపంలో ఎలాగైనా తీసుకోవ‌చ్చు. లోప‌లికి తీసుకోవాల‌నుకున్న వారు పొడి రూపంలో తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ అర టీ స్పూన్ మోతాదులో ఈ చూర్ణాన్ని నీళ్ల‌తో లేదా పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త్రిఫ‌లా చూర్ణం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని, దీనిని వాడ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts