చిట్కాలు

Turmeric Milk : రోజూ రాత్రి పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Turmeric Milk : ప‌సుపును భార‌తీయ‌లు ఎంతో పురాత‌న కాలం నుంచి వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. ప‌సుపును నిత్యం అనేక వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌రోనా వంటి వైర‌స్‌ల‌తోపాటు బాక్టీరియాల‌ను ఎదుర్కొనే శ‌క్తి శ‌రీరానికి ల‌భిస్తుంది. దీంతో ఇన్ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

2. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే దగ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు చాలా మందికి వ‌స్తుంటాయి. అలాంటి వారు రోజూ పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగితే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వాటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.

3. ప‌సుపు మ‌న చ‌ర్మాన్ని ఎంత‌గానో ర‌క్షిస్తుంది. పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.

turmeric milk many wonderful health benefits

4. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగితే నిద్ర చక్క‌గా ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గిపోయి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

5. కీళ్ల నొప్పులు ఉన్న‌వారు, గాయాలు, దెబ్బ‌లు, పుండ్లు అయిన వారు పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఎంతో ఉప‌యోగం ఉంటుంది. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి.

6. సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఛాతి ప‌ట్టేయ‌డం, క‌ఫం త‌గ్గుతాయి. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.

Admin

Recent Posts