Black Hair : దీన్ని ఒక్క‌సారి రాస్తే.. మీ జుట్టు ఎప్ప‌టికీ న‌ల్ల‌గానే ఉంటుంది..!

Black Hair : ముఖం అందంగా ఉన్న‌ప్ప‌టికి కొంద‌రిలో జుట్టు తెల్ల‌గా ఉంటుంది. దీంతో వారు పెద్ద వ‌య‌సు వారి లాగా క‌నిపిస్తారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనేది వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఇబ్బంది పెడుతుంది. ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపూల‌ను ఎక్కువ‌గా వాడిన కూడా జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డుతుంది. ఇవే కాకుండా జుట్టు తెల్ల‌బ‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వాటి వ‌ల్ల కూడా జుట్టు తెల్ల‌బ‌డుతుంది. తెల్ల‌బ‌డిన జుట్టును చాలా మంది రంగు వేసి న‌ల్ల‌గా మారుస్తుంటారు.

కానీ వీటిలో ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు. రంగు వేయ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారిన‌ప్ప‌టికి దాని వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాలు ఉంటాయి. స‌హాజ సిద్దంగా మ‌న వంటింట్లో ఉండే వాటితో కూడా జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. స‌హ‌జ ప‌దార్థాల‌ను ఉప‌యోగించి జుట్టును న‌ల్ల‌గా ఎలా మార్చుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మ‌నం ఉసిరికాయ జ్యూస్, క‌రివేపాకు పొడి, న‌ల్ల నువ్వుల పొడి, మిరియాల పొడి, గోరింటాకు పొడి, టీ పౌడ‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

turn your white hair into Black Hair with this simple remedy
Black Hair

ఒక గిన్నెను తీసుకుని అందులో పైన తెలిపిన ప‌దార్థాల‌న్నింటిని వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రాత్రే త‌యారు చేసి నిల్వ చేసుకోవాలి. ఉద‌యం దీనిని ఉప‌యోగించాలి అనుకునే ముందు కొద్దిగా వేడి చేసి చ‌ల్లారే వ‌ర‌కు ఉంచి జుట్టుకు రాసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత నీటితో క‌డిగివేయాలి. జుట్టును శుభ్రం చేసుకోవడానికి కేవ‌లం నీటిని మాత్ర‌మే ఉప‌యోగించాలి. షాంపును ఉప‌యోగించ‌కూడ‌దు.

ఈ మిశ్ర‌మాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టుకు ఎన్నో పోష‌కాలు అందుతాయి. జుట్టుకు ఈ ప్యాక్ ను త‌ర‌చూ వేసుకోవ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు క్ర‌మంగా త‌యార‌వుతుంది. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాకుండా జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా తెల్ల‌జుట్టును చాలా సుల‌భంగా న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చ‌ని సౌంద‌ర్య నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts