Natu Kodi Pulusu : కారం, మ‌సాలా దట్టించి నాటు కోడి పులుసును ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Natu Kodi Pulusu : నాటుకోడి చికెన్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నాటుకోడి పుల‌సు రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దీనిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. రుచిగా, సులభంగా ఈ నాటుకోడి పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నాటుకోడి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాటుకోడి చికెన్ – ఒక కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, అనాస‌ పువ్వు – 1, యాల‌కులు – 2, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, నీళ్లు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా.

Natu Kodi Pulusu make in this method easy recipe
Natu Kodi Pulusu

నాటుకోడి పులుసు తయారీ విధానం..

ముందుగా నాటుకోడి చికెన్ ను శుభ్రంగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ప‌సుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మారినేట్ చేసిన చికెన్ ను వేసి క‌లపాలి. ఈ చికెన్ ను 50 శాతం వ‌ర‌కు ఉడికే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, ట‌మాటాలు, ప‌చ్చిమిర్చి వేసి క‌లపాలి.

దీనిపై మూత‌ను ఉంచి ట‌మాటాలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత నీళ్లు పోసి కుక్క‌ర్ మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ముక్క‌లు మెత్త‌గా కాకపోతే మ‌రో రెండు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి మ‌రో క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో గ‌రం మ‌సాలా, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ ను నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌రో 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, బ‌గార‌న్నం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts