Cooking Oils : మనం ప్రతిరోజూ రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం చేసే ప్రతి వంటలోనూ నూనె ఉపయోగించాల్సిందే. నూనె లేకుండా వంటలను తయారు చేయలేము. కానీ నూనెలను ఎంత తక్కువగా వాడితే అంత చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మార్కెట్ లో నేడు లభ్యమవుతున్న వంటనూనెలు చాలా వరకు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. వాటిలో హానికరమైన స్యాచురేటెడ్ కొవ్వులు ఉంటున్నాయి. దీంతో అవి అనారోగ్య వంట నూనెలుగానే ఉండిపోతున్నాయి. చాలా మంది గృహిణీలు వంటనూనెలపై ఖచ్చితమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. చాలా మంది టివీలలో చూపించే ప్రకటనలకు ఆకర్షితులై వంట నూనెలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి అనారోగ్య వంటనూనెలు ఏవో తెలియదు.
మన ఆరోగ్యానికి హాని చేసే వంటనూనెలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. వాడకూడని అనారోగ్య వంటనూనెలలో మొదటిది పామాయిల్. సాధారణంగా ఈ వంటనూనెను ఆఫ్రికాలో ఎక్కువగా వాడతారు. ఆఫ్రికాలోని నైజీరియా, కాంగో వంటి దేశాలలోని ప్రజలు దీనిని ఎక్కువగా వాడతారు. ఈ దేశాల్లో పామాయిల్ స్థానిక ప్రదేశాల్లో తయారు చేస్తారు. ఇక్కడి ప్రజలకు ఇది మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో 30 శాతం వరకు స్యాచురేటెడ్ కొవ్వులు ఉండి గుండె ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాగే మన ఆరోగ్యానికి హాని చేసే నూనెల్లో పామ్ కెర్నెల్ ఆయిల్ ఒకటి. చాలా మంది పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ ఒకటేనని భావిస్తారు.
మొదటిది పామ్ పండు నుండి తీస్తారు. రెండవది పామ్ ఫ్రూట్ లోని గింజల నుండి తీస్తారు. పామ్ చెట్లు పెరిగే కోస్తా తీరాల వెంబడి ఈ నూనెను బాగా వాడతారు. అన్నీ వంటనూనెల కంటే కూడా పామ్ ఆయిల్ అనారోగ్యకరమైనది. ఇందులో ట్రాన్స్ ప్యాట్ లు తయారీ విధానం పై ఆధారపడి 80 నుండి 85 శాతం వరకు ఉంటాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. అలాగే స్యాచురేటేడ్ కొవ్వులు కూడా దీనిలో అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ గా 17 శాతంపైగా ఉంటాయి. కొబ్బరి నూనె తల వెంట్రుకలకు మంచి పోషణ ఇస్తుంది. కానీ ఆహారంగా అధికంగా తీసుకుంటే మాత్రం అంత మంచిది కాదు.
కొబ్బరి నూనె అధికంగా మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల వారు ఉపయోగిస్తారు. దీన్ని సాంప్రదాయంగా ఎన్నో వంటల్లో వాడుతున్నప్పటికి వీలైనంత వరకు దీని వాడకాన్ని తగ్గించుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జొన్న నూనె.. కొంత కాలం కిందట జొన్న నూనె ఆరోగ్యకరమైన వంటనూనెగా చెప్పబడుతూ మార్కెట్ లోకి వచ్చింది. కానీ తరువాతి రోజుల్లో అది అనారోగ్యమని దీనిని తీసుకోవడం వల్ల కడుపులో మంట వస్తుందని చెప్పడంతో ఆ నూనె వాడకం తగ్గింది. హైడ్రోజనేటెడ్ ఆయిల్.. పాక్షికంగా హైడ్రోజన్ కలిగి ఉంది అని ఉంటే ఆ నూనె వాడకూడదు. అందులో ట్రాన్స్ ఫ్యాట్ లు అధికంగా ఉండి రక్తనాళాలు మూసుకుపోయేలా చేస్తాయి. తయారీ దారులు పాక్షికం అంటే కొంత మేరకే అని రాసినప్పటికి దానికి తగ్గ హాని జరిగితీరుతుంది. కనుక వంటల్లో హైడ్రోజనేటేడ్ ఆయిల్ ను ఉపయోగించకూడదు. ఏ నూనె వంటలకు, ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఆరోగ్యానికి మేలు చేసే నూనెల్లో ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఒకటి. ఈ నూనె తయారు చేసే పద్దతుల్లో రసాయనాలను అతి తక్కువగా వాడతారు. అందువల్ల ఈ నూనెలో విటమిన్స్,ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనె తాజాగా ఉండడం వల్ల దీనిలో ఓలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. సలాడ్ లలో, పాస్తా చేసిన తరువాత దీనిపై ఆలివ్ నూనెను చల్లితే పోషకాలన్ని మన శరీరానికి అందుతాయి. వేపుడు కూరలు చేసేటప్పుడు, డీప్ ప్రైలు చేసేటప్పుడు ఈ నూనెను వాడకపోవడమే మంచిది.
అలాగే మనం ఉపయోగించదగిన నూనెల్లో సన్ ప్లవర్ ఆయిల్ ఒకటి. ఈ నూనెను ఎక్కువగా వాడతారు. ఈ నూనెను వంటకాల్లో వాడడం వల్ల ఆర్థరైటిస్ సమస్య రాకుండా నివారించవచ్చు. అలాగే దీని ద్వారా ఎక్కువ మోతాదులోనూ విటమిన్స్ ను పొందవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే నూనెల్లో నువ్వుల నూనె ఒకటి. దీనిని ఎంతో కాలంగా వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే దీనిలో అన్ స్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను అరికడతాయి. వేరుశనగ నూనెను కూడా మనం వంటల్లో వాడవచ్చు. గతంలో ఈ నూనెను ఎక్కువగావాడే వారు.
ఈ నూనెను వాడడం వల్ల వంటలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. 100 గ్రా. ల వేరుశనగ నూనెలో 884 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇది ఫంగల్, వైరల్ ఇన్ ఫెక్షన్ ల నుండి దైరంగా ఉంచడమే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మన ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి కదా ఏ నూనెనైనా ఎక్కువగా తక్కువగా వాడకూడదు. అంతేకాకుండా ఒకసారి ఉయోగించిన నూనెను రెండోసారి అస్సలు ఉపయోగించకూడదు.