చిట్కాలు

Besan Flour For Hair : శ‌న‌గ‌పిండితో ఇలా చేస్తే చాలు.. చుండ్రు ఉండ‌దు.. జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..!

Besan Flour For Hair : శనగపిండితో అనేక లాభాలని పొందొచ్చు. శనగపిండి అందాన్ని పెంపొందిస్తుంది. శనగపిండి చుండ్రు మొదలైన సమస్యల్ని కూడా తొలగించగలదు. చాలామందికి ఈ విషయం తెలియ‌దు. శనగపిండి కేవలం ఆరోగ్యానికి, అందానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ శనగపిండి వలన జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి కూడా బయటపడొచ్చు. చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అనేక రకాల ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు.

వాటి కంటే మనం ఇంటి చిట్కాలతో సమస్యల‌ను పరిష్కరించుకోవచ్చు. పైగా, తక్కువ ఖర్చు అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. ఇంట్లో ఉండే ఈ పదార్థాలతోనే సులభంగా మనం జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి బయటపడొచ్చు. అది కూడా ఎక్కువ పదార్థాలు కాదు. కేవలం రెండే పదార్థాలు.

use besan flour for hair in this way

పెరుగు, శనగపిండి రెండు కూడా మన ఇంట్లో ఉండేవే. ఈ రెండింటితో మనం కుదుళ్ళని బలంగా మార్చుకోవచ్చు. ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో మూడు స్పూన్ల దాకా శనగపిండి వేసుకోండి. దీనంతటిని బాగా మిక్స్ చేసి, జుట్టు పై నుండి కింద వరకు బాగా పట్టించండి. ఐదు నిమిషాలు దాకా మసాజ్ చేస్తూ ఉండండి.

అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి బాధలు ఏమీ వుండవు. వారానికి రెండుసార్లు రిపీట్ చేస్తూ ఉండండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. చనిపోయిన చర్మ కణాలని ఇది తొలగిస్తుంది. మాడుని శుభ్రపరుస్తుంది. పెరుగు లో మంచి ప్రోటీన్ కుదుళ్ళకి బలాన్ని ఇస్తుంది. శనగ పిండి కూడా అందమైన కురులని ఇస్తుంది. ఇలా సులభంగా ఈ రెండింటితో మనం అందమైన కురులని పొందవచ్చు. జుట్టు కూడా రాలదు. చుండ్రు కూడా త‌గ్గుతుంది.

Admin

Recent Posts