అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లుఅర్జున్ లవ్‌లో పడి ఆ లవ్‌ను కాస్త పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అల్లుఅర్జున్-స్నేహరెడ్డిల వివాహం మార్చి 06, 2011న జరిగింది.
ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు అల్లుఅర్జున్. ఈ అందమైన జంటకు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు. అల్లుఅర్జున్ మామ బన్నీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ మామ పేరు చంద్రశేఖర్ ఆయన ఓ రాజకీయ వేత్త. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అల్లుఅర్జున్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. బన్నీ అల్లుడిగా 100కు 100 మార్కులు వేసి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంట్లో ఉన్నప్పుడు బన్నీ అనే పిలుస్తాం అని.. బయటకు వెళితే మాత్రం అర్జున్ అనే అంటామని చెప్పాడు.
బన్నీ ఓ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అల్లుఅర్జున్ అత్త జమ్మూకాశ్మీర్ వెళ్లారని, అక్కడ ఎవరో బన్నీ పాట వింటున్నారని చెప్పారు. అక్కడ బన్నీ అత్తగారు అని తెలియడంతో వెంటనే సెల్ఫీలు దిగారు అని చెప్పారు. బన్నీకి ఎంత కట్నం ఇచ్చారో చెప్పాలని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. బన్నీ కట్నమే తీసుకోలేదని చెప్పారు. బన్నీకి ఇచ్చేంత స్థాయి తమకు లేదన్నారు. వాళ్లకే ఎక్కువ ఉందంటూ.. అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి బన్నీ కట్నం తీసుకోలేదా అని అతని అభిమానులు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.