Tamarind Seeds : గ్రామీణ ప్రాంతాల్లో చింతపండు విరివిగా లభిస్తుంది. చింతపండును కొనుగోలు చేసి అందులో ఉండే విత్తనాలను తీసి ఆ పండును నిల్వ చేస్తుంటారు. ఇలా ఏడాదికి ఒకసారి సరిపోయే పండును ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. దీంతో ఏడాది వరకు చింతపండును కొనుగోలు చేయరు. నగరాలు, పట్టణాల్లో అయితే నేరుగా చింతపండునే కొంటారు. అయితే వాస్తవానికి చింత పండు ద్వారా లభించే చింత గింజలను పడేయకూడదు. ఇవి అద్భుతమైన ఔషధగుణాల గని అని చెప్పవచ్చు. మనకు మార్కెట్‌లోనూ చింత గింజలు విడిగా లభిస్తాయి. వాటిని కూడా కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు. చింత గింజలు అరిగిపోయిన కీళ్లను సైతం పనిచేయించగలవు.
చింతగింజలను పెనంపై వేసి దోరగా వేయించాలి. తరువాత 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. దీంతో పొట్టు సులభంగా వస్తుంది. పొట్టు తీసిన తరువాత లోపల ఉండే పలుకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి మళ్లీ ఎండబెట్టాలి. ఎండిన తరువాత వాటిని మళ్లీ పెనంపై వేసి వేయించాలి. తరువాత వాటిని పొడిలా చేయాలి. అనంతరం ఆ పొడికి సమాన భాగంలో పటిక బెల్లం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో నిల్వ చేయాలి.
పైన చెప్పిన విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నవారు, అడుగు వేయడమే కష్టంగా ఉన్నవారు.. రోజుకు 3 సార్లు తీసుకోవచ్చు. లేదా 2 సార్లు తీసుకోవాలి. పూటకు అర టీస్పూన్ చొప్పున ఈ మిశ్రమాన్ని తిని గోరు వెచ్చని నీళ్లను ఒక గ్లాస్ తాగాలి. ఇలా చేస్తుంటే కీళ్లలో అరిగిపోయిన గుజ్జు మళ్లీ వస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు పోతాయి. మళ్లీ యథావిధిగా నడవగలుగుతారు. కీళ్ల నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నవారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మెడ, భుజాలు, మోకాళ్లు, నడుము, పిక్కలు తదితర భాగాల్లో ఉండే ఎముకల్లోని గుజ్జు మళ్లీ తయారవుతుంది. దీంతో నొప్పులు తగ్గి తిరిగి నడవగలుగుతారు. అలాగే నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది.