చిట్కాలు

విరేచ‌నాలు అవుతున్న‌ప్పుడు ఏ ఆహారం తీసుకోవాలంటే..?

డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయడానికి సోయాబీన్‌ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనిష్టులు గుర్తించారు. డయేరియాతో బాధపడుతున్నప్పుడు పది నిమిషాలకొకసారి (కొద్దిమోతాదులోనైనాసరే) నీటిని కాని, రీహైడ్రేషన్‌ డ్రింకులనుకాని తీసుకోవాలి. కొద్దిమోతాదులో ఏదో ఒకరకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిస్కెట్‌, బ్రెడ్‌ లేదా పండ్ల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తింటుండాలి. డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్లరసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింక్‌లు మాత్రం తీసుకోకూడదు. పచ్చి కాయ కూరలు, పళ్ళు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరం. పంటినొప్పి వచ్చినప్పుడు నొప్పి ఉన్నచోట లవంగ నూనె రాయాలి. దాంతో నొప్పి చాలావరకు ఉపశమిస్తుంది.

పది బాదాములను నానబెట్టాలి. పైన పొట్టు తీసి వీటికి పది మిరియాలను చేర్చి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కప్పు వేడి నీటిలో కలపాలి. రుచికోసం కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. రోజుకు రెండు మూడు సార్లు ఈ ద్రవాన్ని తాగుతూ ఉండాలి. పసుపు కొమ్మును కాల్చి దాని పొగ పీల్చాలి. రాత్రి భోజనం తర్వాత ఆరు గ్రాముల వెల్లుల్లి రసం బెల్లంతో కలిపి తినాలి. పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గాయాలను మాన్పే గుణాన్ని, రుగ్మతలను నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పసుపు పైకి కనిపించే గాయాలను మాత్రమే కాకుండా కడుపులో అల్సర్లను కూడా తగ్గిస్తుంది. గ్లాసు నీటిలో చిటికెడు పసుపు వేసి మరిగించి తాగితే మంచిది. పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.

which food you have to take if you have diarrhea

పళ్ళు పసుపుగా గారపట్టినట్లు ఉంటే బ్రష్‌ చేయటం పూర్తయ్యాక ఉప్పునీటితో పుక్కిలించాలి. పళ్ళు స్వచ్ఛంగాను, పటిష్టంగాను ఉండాలంటే ఉప్పు పొడిలో నాలుగైదు చుక్కలు ఆవ నూనెను కలిపి ప్రతిరోజూ పేస్టులాగా వాడాలి. నోటి దుర్వాసన పోవటానికి కుడా ఇది ఉపయోగపడుతుంది. పసుపు జీర్ణవ్యస్థలో సమస్యలను తగ్గించగలుగుతుంది. అరుగుదలకు మందుగా పని చేస్తుంది. ప్రతీరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టీస్పూను తేనె, ఒక టీ స్పూను నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణకోశాన్ని శుభ్రపరచడంతోపాటు శరీరంలోని మలినాలు తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతివంతమవుతుంది. క్రమం తప్పకుండా నెలరోజులు చేస్తే ఫలితం ఉంటుంది. ప్రతి భోజనంలోనూ తప్పనిసరిగా పచ్చి కూరగాయల సలాడ్లు ఉండేలా చూడాలి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి దోహదం చేస్తాయి. పాలల్లో కాస్త పసుపు కలిపి కాచుకొని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జలుబుతో ముక్కు కారుతున్నప్పుడు పసుపు కొమ్ముని కాల్చి ఆ వాసనని పీల్చాలి.

Admin

Recent Posts