Eyes : ఇలా ఉన్న క‌ళ్లు ఇలా మారిపోవాలా.. అయితే ఏం చేయాలో తెలుసా..?

Eyes : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం చ‌క్క‌గా చూడ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పోష‌కాహార లోపం, సెల్ ఫోన్, టివీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువ‌గా వాడ‌డం, నిద్రలేమి, కంటికి త‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. క‌ళ్లు మ‌స‌క‌బార‌డం, క‌ళ్ల నుండి నీళ్లు కార‌డం, కంటి చూపు త‌గ్గ‌డం, క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడి మ‌నం కళ్ల‌ల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొల‌గించుకోవ‌చ్చు.

ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల క‌ళ్లు శుభ్ర‌ప‌డ‌డంతో పాటు కంటి చూపు కూడా మెరుగుప‌డుతుంది. క‌ళ్ల ఆరోగ్యం మెరుగుప‌డి కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కళ్ల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంతో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ చిట్కాలు ఏమిటి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌ళ్ల‌ను శుభ్ర‌ప‌రిచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో రోజ్ వాట‌ర్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ రాత్రి ప‌డుకునే ముందు క‌ళ్ల‌ల్లో రెండు లేదా మూడు చుక్క‌ల రోజ్ వాట‌ర్ ను వేసుకుని ప‌డుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే క‌ళ్ల‌ను చ‌ల్ల‌గా ఉంచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మ‌న‌కు కీర‌దోస ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కీర‌దోస ముక్క‌ల‌ను 15 నిమిషాల పాటు కళ్ల‌పై ఉంచుకోవ‌డం వ‌ల్ల క‌ళ్లు చల్ల‌బ‌డ‌తాయి. అలాగే ఎర్ర‌బ‌డిన క‌ళ్లు కూడా తెల్ల‌గా మార‌తాయి. క‌ళ్ల‌పై కీర‌దోస ముక్క‌ల‌ను ఉంచుకోవ‌డం వ‌ల్ల క‌ళ్ల ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు క‌ళ్ల చుట్టూ ఉండే న‌ల్ల‌టి వ‌ల‌యాలు కూడా త‌గ్గుతాయి.

wonderful home remedies for eyes health follow these tips
Eyes

అలాగే క్ర‌మం త‌ప్ప‌కుండా కీర‌దోస ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల క‌ళ్ల ఆరోగ్యం మెరుగుప‌డి కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. క‌ళ్ల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో పాలు కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. చ‌ల్ల‌టి పాలల్లో దూదిని ముంచి క‌ళ్ల‌పై 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. త‌రువాత క‌ళ్ల‌ను నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌ల్లో ఉండే దుమ్ము, ధూళి తొల‌గిపోతుంది. క‌ళ్ల వాపులు త‌గ్గుతాయి. అదే విధంగా తేనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. క‌ళ్ల‌ల్లో రెండు లేదా మూడు చుక్క‌ల తేనెను వేసుకోవాలి. దీనిని ప‌ది నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు శుభ్ర‌ప‌డ‌తాయి. క‌ళ్ల ఎరుపుద‌నం త‌గ్గుతుంది. అదే విధంగా కీర దోస‌ను జ్యూస్ గా చేసి ఐస్ ట్రేలో వేసి ఫ్రిజ్ లో ఉంచాలి.

కీర‌దోస జ్యూస్ ఐస్ క్యూబ్స్ లా మారిన త‌రువాత వాటిని క‌ళ్ల‌పై ఉంచి మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు చ‌ల్ల‌బ‌డ‌తాయి. క‌ల్ల‌పై ఒత్తిడి త‌గ్గుతుంది. కంటికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చ‌క్క‌గా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంది. ఈ చిట్కాల‌ను పాటిస్తూనే ప్ర‌తిరోజూ చ‌క్క‌గా నిద్ర‌పోవాలి. క‌ళ్ల‌కు వీలైనంత ఎక్కువ‌గా విశ్రాంతిని ఇవ్వాలి. ఈ విధంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం కంటి స‌మ‌స్య‌ల‌ను చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డ‌డంతో పాటు క‌ళ్లు కూడా శుభ్ర‌ప‌డ‌తాయి.

D

Recent Posts