Constipation : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. పీచు పదార్థాలను ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం, నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, మానసిక ఒత్తిడి, వయసు మీద పడడం, ప్రేగుల్లో బ్యాక్టీరియా అధికంగా చేరడం, ఇతర అనారోగ్యాలకు మందులు వాడడం, తగినంత వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత మలబద్దకం సమస్య తలెత్తుతుంది. ఈ మలబద్దకం సమస్య కారణంగా ఇతర అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత త్వరగా మనం ఈ సమస్య నుండి బయటపడడం ఉత్తమం.
సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఈ చిట్కాను పాటించడం వల్ల మలబద్దకం సమస్య నుండి మనం త్వరగా బయటపడవచ్చు. మలబద్దకాన్ని నివారించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకంతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల సమస్య నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. దీనికోసం మనం ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను వేసి నీటిలో కలిసేలా బాగా కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆలివ్ నూనెను కూడా వేసి కలపాలి. తరువాత ఈ నీటిలో రుచికి తగినంత తేనెను కూడా వేసి కలపాలి. ఇలా తయారు చేయడం వల్ల మలబద్దకాన్ని నివారించే డ్రింక్ తయారవుతుంది.
ఈ డ్రింక్ ను రాత్రి పడుకునే ముందు తాగి పడుకోవాలి లేదా ఉదయం లేచిన వెంటనే పరగడుపున తాగాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు పెరిగి ప్రేగుల్లో నిల్వ ఉన్న మలిన పదార్థాలన్నీ బయటకు వస్తాయి. ఈ నీటిని తాగిన వెంటనే సుఖ విరేచనం జరిగి మలబద్దకం సమస్య నివారించబడుతుంది. ఎన్నో రోజుల నుండి వేధిస్తున్న మలబద్దకం సమస్య అయినా సరే ఈ నీటిని తాగడం వల్ల ఒక్క రోజులోనే నివారించబడుతుంది. ఈ చిట్కాను అప్పుడప్పుడూ పాటించడంతోపాటు పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల భవిష్యత్తుల్లో కూడా మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.