Off Beat

రోడ్డు పక్కన ఉండే మైలు రాళ్లకు రంగులు ఎందుకు ఉంటాయి..!

మనం రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విషయాలను గమనిస్తూ ఉంటాం. రోడ్డు పక్కన చెట్లు మధ్యలో డివైడర్లు ఇలా అనేకం రోడ్డుపై ఉంటాయి. మనం వెళ్లే దారి ఎన్ని కిలోమీటర్లు ఉంది, అనే విషయాన్ని అందులో పొందుపరుస్తారు. కానీ రోడ్డు పక్కన కిలోమీటర్లు మరియు వివిధ కలర్ లతో ఉండే మైలురాళ్లను మీరు ఎప్పుడైనా గమనించారా.. వాటిపై ఊరు పేరు మరియు ఆ గ్రామం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది రాసి ఉంటుంది. అలాగే వాటికి డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్ వాడుతూ ఉంటారు. ఆ కలర్ లో ఒక‌ అర్థం ఉన్నది. అదేంటో ఒకసారి చూడండి.

సాధారణంగా రోడ్డు పక్కన ఉండే మైలు రాళ్ళ రంగులు రెండు రకాలు.. సగం వరకు తెలుపురంగు ఉంటే, దాని పై భాగంలో ఉండే రంగు మరో రంగులో ఉంటుంది.. తెలుపురంగు అనేది ప్రతి రాయికి కామన్ గా ఉండే కలర్. తెలుపు రంగుతో పాటుగా మరో కాంబినేషన్ తో వచ్చే రంగు మాత్రమే ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఆ రంగులోనే అసలు అర్థం ఉంది.మైలురాళ్లు ఎల్లో కలర్ లో ఉన్నట్లయితే మీరు నేషనల్ హైవే పైన ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

what are these different types of mile stones

అలాగే ఆ రాళ్లపై గ్రీన్ కలర్ ఉన్నట్లయితే మీరు స్టేట్ హైవే మీద ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒక మైలు రాయి బ్లాక్ లేదా బ్లూ కలర్ లో ఉంటే మీరు సిటీకి దగ్గర్లోనే ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆ మైలు రాయిపై ఎరుపు రంగు ఉంటే మీరు రూరల్ రోడ్లపై ప్రయాణిస్తున్నారని అర్థం. ఈ రోడ్స్ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన క్రిందికి వస్తాయి. ఈ విధంగా రోడ్లపక్కన రంగు రాళ్ళు పెట్టి వాటి అర్థాలను చూపిస్తారు.

Admin

Recent Posts